iPhone 17 Pro: స్పెషల్ ఫీచర్స్, సూపర్ డిజైన్‌తో వస్తున్న ఐఫోన్ 17 ప్రో!

iPhone 17 Pro: ఐఫోన్‌ 17 ప్రొ (iPhone 17 Pro), ఐఫోన్‌ 17 ప్రొ మ్యాక్స్‌ (iphone 17 pro max)లు మాత్రమే అల్యూమినియం ఫ్రేమ్‌తో రానున్నాయి.

Update: 2024-11-28 03:30 GMT

iPhone 17 Pro: స్పెషల్ ఫీచర్స్, సూపర్ డిజైన్‌తో వస్తున్న ఐఫోన్ 17 ప్రో!

iPhone 17 Pro: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం 'యాపిల్' ప్రతి ఏడాది ఐఫోన్ కొత్త సిరీస్‌ను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను గత సెప్టెంబరులో లాంచ్ చేసింది. 16 సిరీస్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. ఈ నాలుగు మోడల్స్ అన్ని సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు 2025 లైనప్‌‌పై యాపిల్ ఫోకస్ పెట్టింది. ఐఫోన్ 17 సిరీస్ 2025లో రిలీజ్ కానుంది. కొత్త సిరీస్‌లో అద్భుత పనితీరు, డిజైన్, కెమెరా టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు ఉంటాయని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో లీకైన సమాచారం ప్రకారం... ప్రో లైనప్‌లో టైటానియం ఫ్రేమ్‌కు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ వస్తుంది. ఐఫోన్‌ 17 ప్రొ, ఐఫోన్‌ 17 ప్రొ మ్యాక్స్‌లు మాత్రమే అల్యూమినియం ఫ్రేమ్‌తో రానున్నాయి. ప్రస్తుత ప్రో మోడల్‌లలో ఉన్న గ్లాస్ బ్యాక్డ్ స్క్వేర్ మాడ్యూల్స్‌కు బదులుగా అల్యూమినియంతో చేసిన దీర్ఘచతురస్రాకార డిజైన్‌తో 17 ప్రో మోడల్‌లు వస్తాయి. ప్రో మోడల్‌లు అల్యూమినియం, గ్లాస్‌తో కూడిన హైబ్రిడ్ బ్యాక్ ప్యానెల్‌లతో వస్తాయని తెలుస్తోంది.

ఐఫోన్ 17 ప్రో లైనప్‌లో A19 ప్రో చిప్‌ను అందించనున్నారు. ఇది ఫోన్ మెరుగైన పనితీరుకు ఉపయోగపడుతుంది. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌ 12జీబీ ర్యామ్‌తో రావచ్చని తెలుస్తోంది. ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్‌లు 5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో రానున్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను ఇవ్వనున్నారు. 17 ఐఫోన్‌లు ఫేస్ ఐడీ టెక్నాలజీతో రానునట్లు తెలుస్తోంది. యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది తన పోర్ట్‌ఫోలియోలో 5 మోడళ్లను రిలీజ్ చేస్తుందో లేదో చూడాలి.

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్స్ బ్లాక్‌, వైట్‌, పింక్‌, టీయల్‌, ఆల్ట్రా మెరైన్‌ రంగుల్లో వచ్చాయి. 17 సిరీస్ కూడా ఇదే రంగుల్లో రానున్నాయి. 48 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌, 12 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉండనుంది. 17 సిరీస్ 128, 256, 512 జీబీ వేరియెంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. 16 సిరీస్ రూ.79,990 నుంచి ప్రారంభం కాగా.. 17 సిరీస్ ఇంతకంటే ఎక్కువగా ఉండనుంది. త్వరలో అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి.

Tags:    

Similar News