Apple: భారతదేశంలో రికార్డు సృష్టించిన యాపిల్ కంపెనీ.. నివేదికలో సంచలన విషయాలు చెప్పిన అశ్విని వైష్ణవ్
Apple iPhone: భారతదేశంలో యాపిల్ ఫోన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కంపెనీ దాని మార్కెట్ పెంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తుంది.
Apple: భారతదేశంలో యాపిల్ ఫోన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కంపెనీ దాని మార్కెట్ పెంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తుంది. ప్రతి రోజు ఆ కంపెనీకి వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది, ప్రజలు ఐఫోన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే భారత్ మార్కెట్ల పై ఉన్న నమ్మకంతో కంపెనీ ఉత్పత్తిని కూడా పెంచింది. ఐఫోన్ ఉత్పత్తి పెరుగుదల కొత్త రికార్డు సృష్టించింది. భారత ప్రభుత్వ పీఎల్ఐ పథకం కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో యాపిల్ ఉత్పత్తి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది, అంటే దాదాపు రూ. 84,000 కోట్లకు చేరుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గత ఆర్థిక సంవత్సరం 24తో పోలిస్తే ఈ సంఖ్య 37 శాతం ఎక్కువని కేంద్ర మంత్రి తన పోస్ట్‌లో తెలిపారు. గత ఏడు నెలల్లో 10 బిలియన్ డాలర్లలో ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లు ఎగుమతి అయ్యాయని తెలిపారు. ఈ రికార్డును మైలురాయిగా అభివర్ణించాడు. అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులలో దాదాపు 70 శాతం ఎగుమతి కాగా, మూడు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లు దేశీయ మార్కెట్లో విక్రయించబడ్డాయి. అక్టోబర్ 2024 భారతదేశంలో యాపిల్ కి చారిత్రాత్మక నెల, ఐఫోన్ ఉత్పత్తి మొదటిసారిగా ఒక నెలలో రెండు బిలియన్ డాలర్లను దాటింది.
నాలుగేళ్లలో 1,75,000 ఉద్యోగాలు
గత 4 ఏళ్లలో యాపిల్‌లో దాదాపు 1,75,000 మందికి ఉద్యోగాలు లభించాయని, అందులో 73 శాతం మంది మహిళలే కావడం ఆసక్తికరమైన విషయమని కేంద్ర మంత్రి తెలిపారు.
పీఐఎల్ పథకం
సామ్‌సంగ్ మినహా చాలా మంది లబ్ధిదారులు మొదటి సంవత్సరంలోనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయినందున పీఎల్ ఐ పథకం 2021ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబడింది. ఆ తర్వాత ఈ పథకాన్ని ఆరేళ్లపాటు పొడిగించారు. ఈ పథకం శాంసంగ్ మినహా ప్రతి సంస్థకు 2026ఆర్థిక సంవత్సరంలో ముగుస్తుంది. దీనికి ఆర్థిక సంవత్సరం చివరి సంవత్సరం.
ఏడు నెలల్లో పెరిగిన ఎగుమతులు
యాపిల్ గత ఏడు నెలల్లో భారతదేశం నుండి సుమారు ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు, కంపెనీ ప్రతి నెలా దాదాపు రూ. 8,450 కోట్ల (దాదాపు $1 బిలియన్) విలువైన ఫోన్‌లను ఎగుమతి చేసింది. జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ భారతదేశంలో ఎన్నడూ లేనంతగా ఆర్జించింది.