Google Wallet: గూగుల్ వ్యాలెట్ యాప్ వచ్చేసింది.. ఇక గూగుల్ పేకు కాలం చెల్లినట్లేనా..!
Google Wallet: ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంపెనీ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
Google Wallet: ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంపెనీ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఇండియాలో గూగుల్ వ్యాలెట్ యాప్‌ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన డిజిటల్ పేమెంట్ యాప్‌కు గూగుల్ పేకు చాలామంది కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా గూగుల్ వ్యాలెట్‌ను తీసుకొచ్చింది. ఇది గూగుల్‌పే పై ఎంతవరకు ప్రభావం చూపనుంది. అలాగే గూగుల్ వ్యాలెట్ ఎలా ఉపయోగించాలి.. తదితర విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.
గూగుల్ వ్యాలెట్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇండియన్ యూజర్స్‌కి స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఇంకా ఈ వ్యాలెట్ చాలా సెక్యూర్డ్. అంతేకాదు ఇండియాలోని టాప్ 20 బ్రాండ్స్‌తో టైఅప్ పెట్టు కుంది. అందులో ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎయిర్ ఇండియా, ఇండిగో, పీవీఆర్, ఐనా క్స్, మేక్ మై ట్రిప్ లాంటి కంపెనీల సర్వీస్‌లూ ఉన్నాయి. ఈ యాప్‌ని వినియోగించుకోవాలను కునే వాళ్లు సింపుల్‌గా ప్లే స్టోర్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఈ యాప్‌లో ప్రస్తుతానికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్ సేవ్ చేసుకునే ఫీచర్ మాత్రం అందుబాటులో లేదని గుర్తుంచుకోండి.
పీవీఆర్‌లో కానీ ఐమాక్స్‌లో కానీ సినిమా టికెట్ బుక్ చేస్తే ఆ ఇ-టికెట్‌ని గూగుల్ వ్యాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రో, కొచ్చి మెట్రోతో పాటు అభిబస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవ చ్చు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోతోనూ టై అప్ అయింది. ఈ ఎయిర్ లైన్స్‌కి సంబంధించిన ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లను ఈ వ్యాలెట్‌లోనే తీసుకోవచ్చు. ఈ పాస్‌లను వ్యాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పుడు ఒక్కోసారి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. డోమినోస్, ఫ్లిప్‌కార్ట్, షాపర్స్‌స్టాప్‌తో గూగుల్ టై అప్ అయింది. ఈ కంపెనీలకు సంబంధించిన రివార్డ్ పాయింట్స్‌ని రిట్రీవ్ చేసుకునే ఫీచర్ ఇందులో ఉంది.
గూగుల్ వ్యాలెట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ గూగుల్ పే మాత్రం కంటిన్యూ అవుతుందని కంపెనీ చెబుతోంది. వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి వీలుండదు. అందుకే గూగుల్ పే అలాగే ఉంటుంది. ఇప్పటికే ఈ డిజిటల్ వ్యాలెట్‌కి అందరూ అలవాటు పడిపోయారు. గూగుల్ పే సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.