GoDaddy: గోడాడీ డేటా గోవిందా..!! హ్యాక్ అయిన 12 లక్షల మంది యూజర్ల డేటా

GoDaddy: గోడాడీ.. వెబ్ సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్ సేవలను అందించే ఈ ప్రముఖ సంస్థ తాజాగా హ్యాకింగ్ కి గురైనట్లు తెలిపింది

Update: 2021-11-23 10:35 GMT

GoDaddy: గోడాడీ డేటా గోవిందా..!! హ్యాక్ అయిన 12 లక్షల మంది యూజర్ల డేటా

GoDaddy Security Hacked: గోడాడీ.. వెబ్ సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్ సేవలను అందించే ఈ ప్రముఖ సంస్థ తాజాగా హ్యాకింగ్ కి గురైనట్లు తెలిపింది. ఒక బలహీనమైన పాస్ వర్డ్ వలన మా ప్రోవజనింగ్ టెక్నాలజీ వ్యవస్థలో అనుమతి లేని ఒక థర్డ్ పార్టీ చొరబాటు జరిగిందని వెల్లడించారు. ఐటీ ఫోరెన్సిక్ సంస్థ సహాయం ద్వారా మా వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో జరిగిన కొన్ని అనుమానాస్పద చర్యలను గుర్తించమని గోడాడీ తెలిపింది. ఈ హ్యాకింగ్ ద్వారా దాదాపుగా 12 లక్షల మంది వినియోగదారుల డేటా హ్యాకింగ్ కి గురైందని వాటి వివరాలు అమెరికా సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ కమిషన్ కు గోడాడీ తెలిపింది.

అయితే గోడాడీ ద్వారా హ్యాక్ చేసిన డేటాను ఎస్ఎస్ఎల్ వివరాలను ఉపయోగించి ఫేక్ డొమైన్ లను సృష్టించి కంపెనీలను డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఈ హ్యాకింగ్ కి గురైన వినియోగదారులు కొత్త ప్రైవసీ కీలతో పాటు సర్టిఫికేట్ లను క్రియేట్ చేసుకోవాలని తెలిపింది. వినియోగదారుల ఆందోళనకు గురయ్యేలా జరిగిన ఈ ఘటన పట్ల తాము క్షమాపణ కోరుతున్నామని అమెరికా సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ కమిషన్‌కు రాసిన లేఖలో గోడాడీ పేర్కొంది. వినియోగదారుల డేటా పట్ల గోడాడీ యాజమాన్యంతో పాటు ఉద్యోగులు కూడా పూర్తి బాధ్యత ఉందని గోడాడీ తెలిపింది.

Tags:    

Similar News