Wi-Fi Password: మీ వైఫై పాస్‌వర్డ్ మరిచిపోయారా?.. ఈ సింపుల్ స్టెప్స్‌తో రికవరీ చేయొచ్చు..!

How To Recover WiFi Password: బీజీ లైఫ్‌లో వైఫై పాస్‌వర్డ్‌ను తరచుగా మర్చిపోతుంటారు.

Update: 2024-11-13 07:46 GMT

Wi-Fi Password: మీ వైఫై పాస్‌వర్డ్ మరిచిపోయారా?.. ఈ సింపుల్ స్టెప్స్‌తో రికవరీ చేయొచ్చు..!

How To Recover WiFi Password: బీజీ లైఫ్‌లో వైఫై పాస్‌వర్డ్‌ను తరచుగా మర్చిపోతుంటారు. దీనికి ఒక కారణం ఏమిటంటే.. పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రజలు తమ పాస్‌వర్డ్ సేఫ్టీ ఉండేలా చూసుకోవడం, దానిని ఎవరూ దొంగిలించకుండా చూసుకోవడం. అలాంటి పరిస్థితుల్లో  కష్టతరమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి, తర్వాత వాటిని మరచిపోతారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైతే.. ఇప్పుడు సింపుల్‌గా పాస్‌వర్ట్‌ని ఎలా రివలరీ చేయాలో తెలుసుకుందాం. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అనే మరచిపోకండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌

1. ముందుగా సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి, ఆ తర్వాత వైఫై నెట్‌వర్క్‌లను ఓపెన్ చేయండి.

2. మీరు కనెక్ట్ చేసిన WiFi లేదా మీ సేవ్ చేసిన నెట్‌వర్క్ లాక్ లేదా 'i' సింబల్‌పై క్లిక్ చేయండి.

3. ఆ తర్వాత షేర్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయండి.

4. స్క్రీన్‌ను అన్‌లాక్ చేయడానికి మీరు మీ ఫోన్ అన్‌లాక్ పిన్ లేదా ఫింగర్‌ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. 

5. QR కోడ్, Wi-Fi పాస్‌వర్డ్ దాని పైన లేదా క్రింద స్క్రీన్ ఓపెన్ చేయండి

6. ఇప్పుడు మీరు పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం ద్వారా లేదా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఇతర గ్యాడ్జెట్లకు కూడా కనెక్ట్ చేయవచ్చు.

ఐఫోన్‌, మ్యాక్

ఆపిల్ సెక్యూరిటీ విధానం కారణంగా iPhoneలో WiFi పాస్‌వర్డ్‌ను ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, కానీ మీకు సహాయపడే ఒక ట్రిక్ ఉంది. దీని కోసం మీకు MacOS PC అవసరం.

MacOS PCని ఉపయోగించి iOS మొబైల్‌లో WiFi పాస్‌వర్డ్‌ను చూడటానికి ఈ చిట్కాలు పాటించండి

1. మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. 

2. ఐక్లౌడ్‌ను ఓపెన్ చేయండి.

3. కీచైన్ ఆప్షన్‌పై నొక్కండి.

4. మళ్లీ సెట్టింగ్‌లకు వెళ్లి, మీ వ్యక్తిగత హాట్‌స్పాట్‌ను ఆన్ చేయండి.

5. ఇప్పుడు మీ Macని మీ పర్సనల్ హాట్‌స్పాట్‌కి కనెక్ట్ అవుతుంది

6. స్పాట్‌లైట్ సెర్చ్ (Cmd + స్పేస్) తెరిచి, కీచైన్ యాక్సెస్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ,

7. ఇప్పుడు మీరు వైఫై నెట్‌వర్క్ కోసం సెర్చ్ చేయచ్చు. దీని పాస్‌వర్డ్ మీరు చూస్తారు.

8. నెట్‌వర్క్ వివరాలను చూపించే పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.

9. ‘షో పాస్‌వర్డ్’పై నొక్కండి.

10. మీ క్రెడెన్షియల్స్‌ను ఎంటర్ చేయండి.

11.ఇప్పుడు మీ Mac WiFi నెట్‌వర్క్ పాస్‌వర్డ్ కనిపిస్తుంది.

Tags:    

Similar News