Air Cooler: గంటల తరబడి కూలర్ ఆన్ చేసినా, చల్లని గాలి రావడం లేదా.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే, గది నిండా మంచు కురవాల్సిందే..!

AC From Cooler: వేడి ఎక్కువగా ఉండడంతో ఇంట్లో, ఆఫీసుల్లో అందరూ చల్లదనం కోరుకుంటున్నారు.

Update: 2024-06-07 08:30 GMT

Air Cooler: గంటల తరబడి కూలర్ ఆన్ చేసినా, చల్లని గాలి రావడం లేదా.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే, గది నిండా మంచు కురవాల్సిందే..!

AC From Cooler: వేడి ఎక్కువగా ఉండడంతో ఇంట్లో, ఆఫీసుల్లో అందరూ చల్లదనం కోరుకుంటున్నారు. ఎండలు విపరీతంగా ఉండడంతో కూలర్, ఏసీలను తెగ వాడేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వేడి విపరీతంగా పెరగడంతో కూలర్ ఎదురుగా ఉన్నా చల్లటి గాలి రావడం లేదు. అయితే, ఇందుకు అనేక కారణాల వల్ల ఉండొచ్చు. అవేంటో తెలుసుకుని, నివారిస్తే.. గుబులు పుట్టించే వేడిలోనూ చల్లని గాలిని ఆస్వాందించొచ్చు. అయితే, చాలా సార్లు గడ్డిలో దుమ్ము విపరీతంగా పేరుకపోవడంతో అవి మూసుకపోతాయి. గడ్డి గుండా గాలి వెళ్ళడానికి స్థలం లేకపోతే, సరిగ్గా లోపలికి రాదు. దీంతో దాని నుంచి చల్లటి గాలి కూడా రాదు.

ఏదైనా చల్లటి గాలి ప్రవహించడానికి గడ్డి మధ్య ఖాళీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ, కొన్నిసార్లు అవి దుమ్ము కారణంగా పేరుకుపోతాయి. అందువల్ల, కూలర్‌లోని గడ్డి పాతదైతే దానిని మార్చాలని సలహా ఇస్తుంటారు. లేకపోతే జెట్ క్లీనింగ్ పైపుతో గడ్డిని క్లీన్ చేయాల్సి ఉంటుంది.

మీరు గుర్తుంచుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే, గది లోపల కూలర్‌ను ఉంచితే, కొన్నిసార్లు చల్లని గాలి రావడం కష్టమవుతుంది. కారణం, గదిలో సరైన కిటికీలు లేకపోవడం, గాలి ప్రవాహం సక్రమంగా రాకపోవడం ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. కూలర్ బయటి గాలిని పీల్చుకుని లోపలికి పంపినప్పుడే మనకు చల్లని గాలి అందుతుంది.

కాబట్టి మీరు గది లోపల కూలర్‌ను ఉంచితే, లోపల గాలి తిరుగుతూ ఉంటుంది. గాలి చల్లగా మారదు. బదులుగా, ఇది గదిలో తేమను మరింత పెంచుతుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

గడ్డి పూర్తిగా తడిసినప్పుడే మనకు చల్లని గాలి ప్రారంభమవుతుంది. అయితే, వాతావరణం తేమగా ఉంటే, కూలర్ సరిగ్గా చల్లబడదని గుర్తుంచుకోవాలి. అందుకే కూలర్‌ గాలిని సక్రమంగా లోపలికి వచ్చేలా, బయటకు పోయేలా చూసుకోవాలి.

అలాగే, పంప్‌ని కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటో నీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో గడ్డి సరిగ్గా తడవదు. దీంతో కూలర్ ఆన్‌లో ఉన్నా.. మనకు చల్లని గాలి అందదు.

Tags:    

Similar News