BSNL 4G: త్వరలో బీఎస్ఎన్‌ఎల్ 4జి సేవలు.. జియో, ఎయిర్ట్‌ల్‌కి పెరిగిన టెన్షన్..!
BSNL 4G: త్వరలో బీఎస్ఎన్‌ఎల్ 4జి సేవలు.. జియో, ఎయిర్ట్‌ల్‌కి పెరిగిన టెన్షన్..!
BSNL 4G: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు విపరీతంగా పెంచేసింది. దీంతో ఇప్పుడు అందరు BSNLకి మారుతున్నారు. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తూ కస్టమర్లను తనవైపునకి ఆకర్షిస్తుంది. గతేడాది డిసెంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 11 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారు. అదే సమయంలో జియో చాలా కస్టమర్లని నష్టపోయింది. ఇప్పుడు BSNL TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎట్టకేలకు భారతదేశంలో 4జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. అయితే 4G లాంచ్ ఖచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
కొత్త నివేదికల ప్రకారం.. BSNL 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 4G కనెక్టివిటీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, BSNL 3G కనెక్టివిటీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అయితే Airtel, Vi, Jio వంటి ప్రైవేట్ టెల్కోలు చాలా సంవత్సరాలుగా 4G సేవలను అందిస్తున్నాయి. 2023లో ఇవి 5Gసేవలను ప్రారంభించడానికి రెడీగా ఉన్నాయి. BSNL భారతదేశం అంతటా 1 లక్ష టెలికాం టవర్లను ఒక్క బీహార్‌లోనే 40,000 టెలికాం టవర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
కంపెనీ తన 4G కనెక్టివిటీని ప్రకటించడానికి సిద్ధమవుతుండగా Vodafone Idea, Airtel, Reliance Jio వంటి ఇతర టెలికాం సంస్థలు దేశంలో 5G కనెక్టివిటీ ట్రయల్స్‌నుప్రారంభించాయి. అయితే BSNL 4G కనెక్టివిటీ గ్రామీణ, మారుమూల ప్రాంతాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఢిల్లీ, ముంబైలలో 4G సేవలను అందిస్తుంది.