Bisleri Mobile App: "బిస్లరీ" మొబైల్ యాప్ లాంచ్.. 24 గంటల్లో వాటర్ క్యాన్ డోర్ డెలివరీ
Bisleri Mobile App: ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ స్వచ్చమైన తాగు నీటిని బాటిల్స్, ప్యాకెట్లలో విక్రయిస్తూ పాపులర్ బ్రాండ్‌గా రాణిస్తోంది. బిస్లరీ బ్రాండ్ తమ బిజినెస్ ని మరింత విస్తరించేందుకు నూతన సేవలకు శ్రీకారం చుట్టింది. బిస్లరీ డైరెక్ట్ టు కన్స్యూమర్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించింది. ఈ యాప్ సహాయంతో వినియోగదారులు ఆన్లైన్ లో నేరుగా వాటర్ క్యాన్లను బుకింగ్ చేసుకునే అవకాశం కలిపించింది. బుకింగ్ చేసుకున్న 24 గంటల లోపు డోర్ స్టెప్ విధానంలో వాటర్ క్యాన్లను వినియోగదారుడి ఇంటికే డెలివరీ చేస్తారు.
ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ డోర్ డెలివరీ సేవలను హైదరాబాద్, బెంగుళూరు, అహ్మదాబాద్, చెన్నైలతో పాటు మరో 26 నగరాల్లో ఈ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. బిస్లరీ మినరల్ వాటర్ ను డోర్ డెలివరీ పొందడం కోసం వినియోగదారులు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 4500 డిస్ట్రిబ్యూటర్లతో పాటు 122 ఆపరేషనల్ ప్లాంటులతో దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో 24 గంటలు మినరల్ వాటర్‌ను డెలివరీ చేయనున్నామని.. కొవిడ్-19 కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిస్లరీ సీఈవో అంజెలో జార్జ్ తెలిపాడు.