Smartphone: తక్కువ ధరలో మంచి ఫోన్‌ కోసం చూస్తున్నారా.? నెలకు రూ. 500 చెల్లిస్తే చాలు..!

Amazon Smartphone Sale: మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ సందడి చేస్తున్న నేపథ్యంలో ఏ ఫోన్‌ కొనుగోలు చేయాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.

Update: 2024-06-15 06:31 GMT

Smartphone: తక్కువ ధరలో మంచి ఫోన్‌ కోసం చూస్తున్నారా.? నెలకు రూ. 500 చెల్లిస్తే చాలు..!

Amazon Smartphone Sale: మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ సందడి చేస్తున్న నేపథ్యంలో ఏ ఫోన్‌ కొనుగోలు చేయాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా.? మీ బడ్జెట్‌ రూ. 10వేల లోపా.? అయితే మీకోసమే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌పై మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఆఫర్స్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 10 వేలలోపే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ అమెజాన్‌లో ఏయే ఫోన్‌లపై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఈ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

పోకో ఎమ్‌6 5జీ ఫోన్‌..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకోపై అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ లభిస్తోంది. పోకో ఎమ్‌6 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 8,999గా ఉంది. ఈ ఫోన్‌ను మీరు నెలకు కేవలం రూ. 436 ప్రారంభ ఈఎమ్‌ఐతో కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.74 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

గ్యాలక్సీ ఎమ్‌14..

సామ్‌సంగ్ వంటి బ్రాండెడ్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ధర ఎక్కువని వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌14పై మంచి ఆఫర్‌ లభిస్తోంది. ఈ పోన్‌ను రూ. 9,790కే సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 475 ఈఎమ్‌ఐ చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

రెడ్‌మీ 13సీ..

తక్కువ ధరలో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌ కోసం చూస్తున్న వారికి రెడ్‌మీ 13సీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ ధర రూ. 10,499గా ఉంది. ఈ ఫోన్‌ను నెలకు రూ. 509 నెలవారీ వాయిదాతో సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో MediaTek డైమెన్సిటీ 6100+ 5G SoC ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 

Tags:    

Similar News