Smartphone Charging: రాత్రిపూట ఫోన్‌కి ఛార్జింగ్‌పెడుతున్నారా.. చాలా హానికరం గురూ..!
Smartphone Charging: ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి స్మార్ట్‌ఫోన్లు కొంటున్నారు.
Smartphone Charging: ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి స్మార్ట్‌ఫోన్లు కొంటున్నారు. కానీ వాటికి ఛార్జింగ్ పెట్టే విషయంలో మాత్రం చాలా తప్పులు చేస్తున్నారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ త్వరగా దెబ్బతింటుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉండటం లేదు. దీనికి కారణం ప్రతి ఒక్కరు తెలియకుండా చేసే తప్పులే. వాస్తవానికి ఫోన్‌కి బ్యాటరీ అనేది ఒక గుండె వంటిది. ఇది లేకుండా ఫోన్ ఓపెన్ కాదు. అంతేకాదు ఎటువంటి ఫోన్ కాల్స్ చేయలేరు. అటువంటి బ్యాటరీని రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి దారుణంగా దెబ్బతీస్తున్నారు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.
నేటి రోజుల్లో ఫోన్‌లో కాస్త బ్యాటరీ తగ్గితే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తున్నారు. బ్యాటరీ 100 శాతం ఉంటే అది ఎక్కువసేపు వస్తుందని అనుకుంటున్నారు. ఇంకొంతమంది రాత్రిపూట ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టి అలాగే ఉంచుతారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతోంది. బ్యాటరీపై చెడు ప్రభావం పడుతుంది. ఆపిల్ కంపెనీ ప్రకారం ఐఫోన్‌కి చాలా సమయం ఛార్జింగ్ పెడితే బ్యాటరీ దెబ్బతింటుందని తెలిపింది. అలాగే శామ్‌సాంగ్, అనేక ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ కంపెనీలు కూడా ఇదే మాట చెబుతున్నారు.
ముఖ్యంగా రాత్రిపూట ఫోన్‌ని ఎక్కువసేపు ఛార్జర్‌కి కనెక్ట్ చేసి ఉంచవద్దు. బ్యాటరీ స్థాయిని 30% నుంచి 70% మధ్య ఉంచడం ద్వారా ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవచ్చు. బ్యాటరీ ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ ఆగిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాటరీ స్థాయి 99%కి పడిపోయినప్పుడు మళ్లీ 100% వరకు తిరిగి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీనివల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో 90 శాతం ఛార్జింగ్ కాగానే ఆపేయడం ఉత్తమం.