iPhone SE 4: హైప్ పెంచుతున్న లీక్స్.. బడ్జెట్ ఐఫోన్ వస్తుంది.. ధర ఎంతంటే?
iPhone SE 4: ఆపిల్ 2022 నుండి మార్కెట్లో ఏ బడ్జెట్ ఐఫోన్‌ను ప్రవేశపెట్టలేదు. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త బడ్జెట్ ఐఫోన్‌పై పనిచేస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
iPhone SE 4: ఆపిల్ 2022 నుండి మార్కెట్లో ఏ బడ్జెట్ ఐఫోన్‌ను ప్రవేశపెట్టలేదు. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త బడ్జెట్ ఐఫోన్‌పై పనిచేస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అందులో iPhone SE 4 ఉంది. ఇది వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, డిజైన్, స్పెసిఫికేఫన్లు లీక్ అయ్యాయి. ఆపిల్ ఈ రాబోయే బడ్జెట్ ఐఫోన్ గతంలో లాంచ్ అయిన అన్ని iPhone SE సిరీస్ ఫోన్‌ల కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లతో రానుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iPhone SE 4 Price
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ ఆపిల్ బడ్జెట్ ఫోన్ ధర iPhone SE 3కి సమానంగా ఉంటుంది.లేదా 10 శాతం ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం USలో ధర దాదాపు $429 లేదా దాదాపు $470 వరకు ఉండవచ్చు. భారతదేశంలో ఐఫోన్ SE 3 రూ. 43,900 ధరతో లాంచ్ అయింది. ఐఫోన్ SE 4 ధర రూ. 50,000 లోపు ఉండవచ్చు.
iPhone SE 4 Design
లీకుల ప్రకారం ఈ బడ్జెట్ ఫోన్ iPhone 14 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంది.
iPhone SE 4 Specifications
ఆపిల్ ఐఫోన్ SE 4 అనేది అనేక ప్రధాన అప్‌డేట్లతో రానుంది. అతిపెద్ద మార్పులలో ఒకటి డిస్‌ప్ల SE 4 BOE OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. ఇది మునుపటి SE మోడళ్లలో ఉపయోగించిన LCD స్క్రీన్ నుండి భారీ మార్పు. OLED డిస్‌ప్లే మెరుగైన కలర్, కాంట్రాస్ట్‌తో వస్తుంది.
ఐఫోన్ SE 4 USB-C పోర్ట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. USB-C పోర్ట్ వేగంగా ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి సహాయపడుతుంది. దీనిలోని ఒక ముఖ్యమైన అప్‌డేట్ బ్యాటరీ అప్‌గ్రేడ్‌కి సంబంధించినది కావచ్చు. ఇది ఐఫోన్ 14లో ఉన్న 3,279mAh బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. ఐఫోన్ SE 3 మొబైల్ 2,018mAh బ్యాటరీని కలిగి ఉంది.