Amazon Mobile Offers: ఇదెక్కడి ఆఫర్ రా నాయనా.. రూ. 349కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్!

Amazon Mobile Offers: అమెజాన్ టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ. 349 నెల ఈఎమ్ఐగా చెల్లించి కూడా మీ సొంతం చేసుకోవచ్చు.

Update: 2024-08-05 14:23 GMT

Amazon Mobile Offers

Amazon Mobile Offers: దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. దీంతో టెక్ కంపెనీలు కుప్పలు కుప్పలుగా ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌లో ప్రీమియం ఫీచర్లతో ఫోన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డీల్ ఆఫర్ చేసింది. 8 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీతో కలిగిన Tecno Spark Go 2024పై డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark Go Discount
ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ టెక్నో స్పార్క్ గోపై డిస్కౌంట్ అందిస్తోంది. ఫోన్‌ను రూ. రూ.7199కి సేల్‌కి తీసుకొచ్చారు. మీరు దీన్ని దాదాపు రూ. 360 క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ. 349 నెల ఈఎమ్ఐగా చెల్లించి కూడా మీ సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ. రూ.6800 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అనేది కంపెనీ పాలసీ, మొబైల్ పర్ఫామెన్స్, పిన్ కోడ్‌పై ఆధారపడి ఉంటుంది.

Tecno Spark Go Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో 720x1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో పాండా స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇందులో కంపెనీ డైనమిక్ పోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఫోన్ 8 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్‌గా మీకు ఫోన్‌లో Unisoc T606 చిప్‌సెట్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన బ్యాక్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.

వీటిలో 13 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు AI లెన్స్‌ను ఉంటాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూస్తారు. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 10 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.  ఫోన్‌లో DTS సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. OS విషయానికి వస్తే ఫోన్ Android 13 (Go Edition) ఆధారంగా HiOS 13లో రన్ అవుతుంది.

Tags:    

Similar News