Best Smartphone Deal: రూ. 5,999లకే రియల్‌మి ఫోన్.. 32 MP కెమెరా.. ఇలాంటి డీల్ వదలకండి..!

Best Smartphone Deal: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మి Narzo N61 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 5,999లకి కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-29 10:54 GMT

Realme Narzo N61

Best Smartphone Deal: రియల్‌మి నార్జో సిరీస్ హ్యాండ్‌సెట్‌లు బడ్జెట్ ప్రైస్‌లోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తాయి. దీని ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లకు  దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు అమెజాన్ సేల్ సమయంలో దాని బడ్జెట్ హ్యాండ్‌సెట్‌ను రూ. 6000 కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. Realme Narzo N61 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

90Hz రిఫ్రెష్ రేట్, ప్రీమియం ఫినిషింగ్ డిజైన్ వంటి ఫీచర్లు సాధారణంగా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో కనిపించవు. అయితే Realme నుండి వచ్చిన ఈ ఫోన్‌లో హై ఎండ్ ఫీచర్లు ఉంటాయి. Realme Narzo N61లోని పెద్ద 90Hz డిస్‌ప్లే వినియోగదారులకు మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 32MP కెమెరా ఉంది. ఫోన్‌‌లో పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంటుంది.

ఈ  రియల్‌మి 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ అసలు ధర రూ.రూ. 7,500. అయితే ఇప్పుడు  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ వేరియంట్‌ను రూ. 5,999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సేల్ సమయంలో Realme Narzo N61ని వాయేజ్ బ్లూ, మార్బుల్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N61 Specifications
రియల్‌మి ఈ బడ్జెట్  స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 560 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. ఇది Unisoc టైగర్ T612 ప్రాసెసర్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో 6GB వరకు RAM కలిగి ఉంది. ఇది Android 14 ఆధారంగా RealmeUI 5.0 సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక ప్యానెల్‌లో 32MP ప్రైమరీ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Tags:    

Similar News