Amazon Great Indian Festival Sale 2024: భారీ సేల్.. రూ.149, రూ.199కే మొబైల్స్, యాక్సెసరీస్.. సిద్ధమేనా..!

Amazon Great Indian Festival Sale 2024: అమెజాన్ అతిపెద్ద సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 త్వరలో ప్రారంభం కానుంది. సేల్‌లో తక్కువ ధరకే మొబైల్స్, యాక్సెసరీస్ కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-13 07:13 GMT

Amazon Great Indian Festival Sale 2024

Amazon Great Indian Festival Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఇది ఈ ఏడాది అతిపెద్ద సేల్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీలు, ఫ్రిజ్‌లతో పాటు ఇతర ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిడ్, డెబిట్ కార్డులపై డిస్కౌంట్లు ఉంటాయి. అంతేకాకుండా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. దీని కోసం అమెజాన్ నుంచి మైక్రో వెబ్‌సైట్‌ను లైవ్ చేశారు. ఈ సేల్‌ చాలా ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం దీపాళికి ముందు సేల్ స్టార్ట్ అవుతుంది. రండి ఈ సేల్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్‌ను ప్రకటించలేదు. త్వరలోనే సేల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ నెలలోనే సేల్ స్టార్ట్ అవొచ్చు. సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ పేజీ నుండి తెలుసుకోవచ్చు. పేజీ ప్రకారం సేల్‌లో SBI కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై ఉంటుంది. ఇది కాకుండా వెల్‌కమ్ రివార్డ్ కింద 20 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది.

పేజీ ప్రకారం మీరు రూ. 199 ప్రారంభ ధరతో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలను కొనుగోలు చేయగలుగుతారు. అమెజాన్ బ్రాండ్ ఉత్పత్తులను రూ.149 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం మీకు లభిస్తుంది. మొబైల్స్, యాక్సెసరీస్ సేల్‌లో రూ.5,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటాయి. మీరు రూ. 1,999 ప్రారంభ ధరతో అలెక్సా, ఫైర్ టీవీని కొనుగోలు చేయవచ్చు.

వస్తువులను కాకుండా మీరు సేల్‌లో ప్రయాణ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంపై 60 శాతం వరకు తగ్గింపు పొందుతారు. ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. అయితే సేల్ ప్రారంభం కావడానికి ముందే అమెజాన్ అనేక ఆఫర్లను వెల్లడించే అవకాశం ఉంది. అలాగే సేల్ తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు.

Tags:    

Similar News