Australia's Big Bash: ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడనున్న యువీ!?
Australia's Big Bash: ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) లో ఆడేందుకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది.
Australia's Big Bash: ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) లో ఆడేందుకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందినట్టు తెలుస్తుంది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పిన తర్వత యువీ .. తొలిసారి అబుదాబి వేదికగా జరిగిన గ్లోబల్ టీ20 కెనడా టీ10 లీగ్‌లో పాల్గొన్నాడు. తద్వారా ఓవర్సీస్ టీ20 లీగ్ ఆడిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
అలాగే.. ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్నది. ఈ లీగ్‌లో యువీ పాల్గొంటారని అతని మేనేజర్ జాసన్ వార్న్ వెల్లడించారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో ఈ దిశగా చర్చలు కూడా జరుపుతున్నామన్నాడు. ఇక వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా యువీ పాల్గొంటాడని ప్రచారం జరిగింది. యితే యువరాజ్ సింగ్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్‌లో ఏ మేరకు ఆసక్తికనబరుస్తాయో చూడాలి.