IND vs NZ: మరి కాసేపట్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్

IND vs NZ: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ సౌథాంప్టన్‌ వేదికగా ప్రారంభం కానుంది.

Update: 2021-06-18 05:19 GMT

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (ఫైల్ ఇమేజ్)

IND vs NZ: కరోనా ప్యాండమిక్ సిట్యుయేషన్ లో స్పోర్ట్స్ లవర్స్ కి క్రేజీ డేస్ వచ్చేశాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరగనున్న ఈ మ్యాచ్ ఇంట్రస్టింగ్ గా జరగనున్నదనడంలో ఎలాంటి డౌట్ లేదు. మామూలుగా అయితే టెస్ట్ మ్యాచ్ పెద్దగా ఆసక్తి కలిగించదు. ట్వంటీ ట్వంటీ అలవాటైన వాళ్లకి అసలే నచ్చదు. కాని ఇప్పుడు కరోనా వల్ల ఏ మ్యాచ్ లు జరగడం లేదు. దాంతో కరువులో ఉన్న క్రీడాభిమానులకు ఈ టెస్ట్ మ్యాచ్ పండగే మరి.

మరికొద్ది గంటల్లో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కు తెరలేవనుంది. భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నా.. చివరికి విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంఎస్‌ ధోనీ సరసన చేరేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశపడుతుండగా.. తన హయాంలోనైనా తొలి ఐసీసీ ట్రోఫీని బహుమతిగా ఇవ్వాలని కేన్ విలియమ్సన్ ఆరాటపడుతున్నారు. ఫైనల్ సమరానికి ముందు ఇంగ్లండ్ తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలిచి, సగర్వంగా బరిలోకి దిగనుంది కేన్ సేన. మరోవైపు కేవలం ప్రాక్టీస్ మ్యాచ్‌లతోనే ఆత్మస్థైర్యం మూటకట్టుకొని మైదానంలో అడుగుపెట్టబోతోంది విరాట్ సేన. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ, పుజారా, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ కీలకంగా మారనున్నారు. మరోవైపు కివీస్ టీం నుంచి కేన్ విలియమ్సన్‌, ట్రెంట్ బౌల్ట్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. కాగా, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ట్రెంట్ బౌల్ట్ ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. అలాగే కేన్ విలియమ్సన్, బుమ్రా ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది.

Tags:    

Similar News