Vinesh Phogat: వినేష్ ఫోగాట్ భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తుంది? రజత పతక వివాదంపై నిర్ణయం ఎప్పుడంటే?

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. దీని కోసం, 117 మంది సభ్యులతో కూడిన భారత బృందం పారిస్‌కు వెళ్లింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు.

Update: 2024-08-13 04:15 GMT

Vinesh Phogat: వినేష్ ఫోగాట్ భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తుంది? రజత పతక వివాదంపై నిర్ణయం ఎప్పుడంటే?

Vinesh Phogat Arriving in India: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసిన తర్వాత, ఇప్పుడు భారత జట్టు దేశానికి తిరిగి రాబోతోంది. భారత జట్టు మంగళవారం (ఆగస్టు 13) తిరిగి రానున్నారు. అయితే స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ మాత్రం తిరిగి రాదు. వినేష్ రజత పతకానికి సంబంధించి ఈరోజు (ఆగస్టు 13) నిర్ణయం తీసుకోవడమే పెద్ద విషయం. వినేష్ మరుసటి రోజు అంటే బుధవారం (ఆగస్టు 14) భారతదేశానికి రావచ్చు.

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. దీని కోసం, 117 మంది సభ్యులతో కూడిన భారత బృందం పారిస్‌కు వెళ్లింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు. అయితే ముగింపు వేడుకలో 'పరేడ్ ఆఫ్ నేషన్స్'కి భారత పతాకధారులుగా ఉన్న పీఆర్ శ్రీజేష్, మను భాకర్‌తో సహా ఇతర అథ్లెట్లు, భారత బృందం మంగళవారం (ఆగస్టు 13) దేశానికి తిరిగి రానున్నారు.

బయటకు వచ్చిన వినేష్ వీడియో..

వినేష్ ఫోగట్ స్వదేశానికి తిరిగి రావడానికి ఒలింపిక్ విలేజ్ నుంచి బయలుదేరింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటపడింది. అందులో వినేష్ బ్యాగ్‌తో వెళ్తున్నట్లు కనిపించింది. అయితే, ఆమె మంగళవారం వస్తుందా.. బుధవారమా అనేది క్లారిటీ లేదు. అయితే వినేష్ బుధవారం వచ్చే అవకాశం ఉంది.

వినేష్ సన్నిహితుడు మాట్లాడుతూ, 'వినీష్ ప్రస్తుతం కొంచెం మెరుగ్గా ఉంది. ఆమె కొంచెం కొంచెం తినడం ప్రారంభించింది. ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు. మేమంతా ఆమెతోనే ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.

గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు అనర్హురాలిగా..

పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కానీ, ఒలింపిక్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు కంటే ఆమె బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో.. ఆమె పతక పోటీకి ముందు అనర్హురాలిగా తేలింది.

దీంతో వినేష్‌ సీఏఎస్‌లో కేసు దాఖలు చేయగా, దీనిపై ఆగస్టు 13న నిర్ణయం వెలువడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వినేష్ ఫోగట్‌కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినేష్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తే ఉమ్మడిగా రజత పతకం ఖాయం అవ్వనుంది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు..

మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి పతకాన్ని, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్యాన్ని గెలుచుకుంది. ఆపై 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీని తర్వాత పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించి భారత్‌కు నాలుగో పతకాన్ని అందించింది. ఆ తర్వాత జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. కాగా, రెజ్లర్ అమన్ సెహ్రావత్ 57 కిలోల రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించి ఆరో పతకాన్ని అందుకున్నాడు.

Tags:    

Similar News