వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ బాంగ్లాదేశ్ బౌలర్లపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. భారీ స్కోరు సాధించే దిశలో దూకుడుగా ఆడుతున్నారు. ఓపెనర్ లూయిస్ 67 బంతుల్లో 70 పరుగులు చేసి హాసన్ బౌలింగ్ లో షకీబ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తరువాత వచ్చిన పూరన్ హోప్ కు అండగా ఉన్నాడు. హోప్ తన అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ 151 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. హోప్ 78 బంతుల్లో 51 పరుగులు, పూరన్ 23 బంతుల్లో 21 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.