ఆ ఇద్దరి ఆటతీరు నిరాశపరిచింది: వీవీఎస్ లక్ష్మణ్

తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Update: 2021-02-11 12:00 GMT

వీవీఎస్ లక్ష్మణ్

చెపాక్ వేదికగా ఇంగ్లాండ్(EnglandvsIndia) తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఓటమి తర్వాత సినీయర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రహానే ఆటతీరుపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత ఆసీస్ పర్యటనలో కూడా కెప్టెన్ గా రహానే ఓకే అనిపించినా.. వ్యక్తిగత ప్రదర్శనలో విఫలమవుతున్నాడు. దీంతో రహానే వేటు వేసి అతని స్థానంలో సాహాకు అవకాశం ఇవ్వాలని కొందరూ సినియర్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా హిట్ మ్యాన్ రోహిత్ ను తొలిగించి స్వదేశంలో గొప్ప రికార్డు ఉన్న మయాంక్ అగర్వాల్ కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత్ జట్టు ప్రదర్శనపై వీవీఎస్ లక్ష్మణ్(Laxman)‌స్పందించారు. రోహిత్‌, రహానే ఆటతీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించాడు. రెండో టెస్టులోనైనా రోహిత్ శర్మ, రహానేల నుంచి మంచి కమిట్‌మెంట్‌ను చూడాలనుకుంటున్నా అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా లక్ష్మణ‌్ మాట్లాడుతూ.. రహానే నుంచి ఏలాంటి ఎఫర్ట్ కనిపించడంలేదు. అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినా.. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొని రహానే బౌల్డయ్యాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డయ్యాడు. ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండో టెస్టులో ఇద్దరూ జాగ్రత్తగా ఆడాలని లక్ష్మణ్ సూచించాడు.

ఇక తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు నిరాశపరిచారు. రోహిత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 6,12 పరుగులు చేయగా.. రహానే 1, 0 పరుగులతో పూర్తిగా తేలిపోయాడు.

Tags:    

Similar News