Virender Sehwag Slams BCCI on Rohit Sharma's Injury : ఇండియన్ క్రికెట్‌లో రోహిత్ శర్మ వ్యవహారం హీట్ పుట్టిస్తుందిప్పుడు ! ఆస్ట్రేలియా టూర్‌కు హిట్ మ్యాన్‌ను ఎంపిక చేయకపోవడంపై దుమారం రేగుతోంది. చిన్న గాయానికే హిట్‌మ్యాన్‌ను ఎలా పక్కన బెడతారు గాయం నుంచి కోలుకొని ఐపీఎల్‌లో మళ్లీ ఆడుతున్నాడు కదా మీరెందుకు సెలెక్ట్ చేయలేదంటూ అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు బీసీసీఐపై మండిపడుతున్నారు. ఐతే ఈ లిస్టులో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేరాడు. రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి సరిగా లేదంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. రోహిత్ పరిస్థితి ఏంటో తనకు తెలియదని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఫైర్ అయ్యాడు.
రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదని సెలక్షన్ కమిటీలో ఆయన భాగం కానప్పటికీ రెండు మూడు రోజుల ముందైనా కోచ్ అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చాడు. రోహిత్ గాయపడితే అతడి స్థానంలో మరెవరినైనా ప్రత్యామ్నాయంగా ప్రకటించాలని ఐతే అలా ఎందుకు జరగలేదని సెహ్వాగ్ క్వశ్చన్ చేశాడు. రోహిత్‌నూ జట్టులోకి ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది అన్ని వింతలే జరుగుతున్నాయని బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పించాడు.