Virat Kohli About Sachin Tendulkar: అందుకే సచిన్ ని భుజాల పైన ఎత్తుకొని తిరిగాం : కోహ్లి
Virat Kohli About Sachin Tendulkar: 2007 ప్రపంచ కప్ లో ఘోర ఓటమి పాలు అయిన టీంఇండియా జట్టు నాలుగు నెలల తర్వాత 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచి అందరిని ఆశ్చర్యపరిచింది.
Virat Kohli About Sachin Tendulkar: 2007 ప్రపంచ కప్ లో ఘోర ఓటమి పాలు అయిన టీంఇండియా జట్టు నాలుగు నెలల తర్వాత 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక 2011 ప్రపంచ కప్ వచ్చేసరికి అందరి ద్రుష్టి సచిన్ మీదే నెలకొంది. ఎందుకంటే అదే సచిన్ కి అదే చివరి ప్రపంచ కప్.. ఈ క్రమంలో సచిన్ తన చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలంటే అతగాడికి ఇదే చివరి అవకాశం... దీనితో ఎలాగైనా టోర్నీని గెలవాలని ధోనీసేన నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వరుస మ్యాచ్ లను గెలుచుకుంటూ వచ్చింది. ఇక క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను, సెమీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్ లో శ్రీలంకను ఎదురుకునేందుకు సిద్దం అయింది. చివరగా శ్రీలంకనూ ఓడించింది.
దీనితో 1983 తర్వాత వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది భారత్.. ఇక అనంతరం ఆటగాళ్లంతా లిటిల్ మాస్టర్‌ను తమ భుజాలపై ఎక్కించుకొని వాంఖడే స్టేడియంలో గౌరవ వందనం అందించారు. తాజాగా దీనికి సంబంధించిన గుర్తులను కోహ్లి నెమరువేసుకున్నాడు. ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ రెండో భాగంలో మాట్లాడుతూ ఈ మధురజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.
లిటిల్‌మాస్టర్ దేశం కోసం ఎంతో చేశాడు. దీనితో తాము కూడా సచిన్ కి ఏదైనా తిరిగి ఇవ్వాలనుకున్నాం.. అందులో భాగంగానే సచిన్ ని మా భుజాలపై ఎత్తుకొని తిరగం.. అదే మేం ఇచ్చిన మంచి బహుమతి.. ఎందుకంటే టీమ్‌ఇండియాకు అలాంటివి అతనెప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. అందుకే అదే సరైన పద్ధతని నిర్ణయించుకొని అలా చేశాం అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచింది.