Virat Kohli: ఆ పరిస్థితి వస్తే క్రికెట్ నుండి తప్పుకుంటా..

* స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి, కోచ్‌గా రవిశాస్త్రికి టీమిండియా విజయంతో వీడ్కోలు

Update: 2021-11-09 07:21 GMT

Virat Kohli: ఆ పరిస్థితి వస్తే క్రికెట్ నుండి తప్పుకుంటా

Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా సోమవారం స్కాట్లాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన టీమిండియా గ్రూప్ 2 పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచి టీ20 ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించింది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి, కోచ్‌గా రవిశాస్త్రికి టీమిండియా విజయంతో వీడ్కోలు పలికింది. మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ కోహ్లి మీడియా సమావేశంలో మాట్లాడాడు.

టీ20 కెప్టెన్ గా ఇన్ని రోజులు ఉండటం గొప్పగా ఉందని అలాగే ప్రస్తుతం కెప్టెన్సీ నుండి తప్పుకోవడం చాలా రిలీఫ్ గా ఉందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనపై ఉన్న పని భారాన్ని తగ్గించుకోడానికి ఇదే సరైన సమయమని గత 6 ఏళ్ళుగా కెప్టెన్ గా ఉన్నందున తనపై పని భారం కూడా ఎక్కువైందని విరాట్ తెలిపాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు టీమిండియా సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కోచ్ తో పాటు సిబ్బంది ఆటగాళ్ళకు అన్ని వేళలా మంచి వాతావరణాన్ని కల్పించి అందరితో కలిసిపోయారన్నాడు.

ఇక పాకిస్తాన్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో తమ ప్రదర్శన అస్సలు బాలేదని, ధైర్యంగా మ్యాచ్ లను ఆడలేకపోయామని తెలిపాడు. ఇక కెప్టెన్సీ నుండి తప్పుకున్నంత మాత్రాన ఆట ఏ మాత్రం తగ్గదని, నేను ఆడలేని పరిస్థితి వచ్చిన రోజున క్రికెట్ నుండి తప్పుకుంటానని విరాట్ కోహ్లి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News