IND vs BAN: కోహ్లీ మాస్టర్‌ప్లాన్‌తో ధోనీని పెవిలియన్ చేర్చాడు.. కట్‌చేస్తే.. బంగ్లాతో తొలి టెస్ట్‌కు లక్కీ ఛాన్స్..!
Yash Dayal: యశ్ దయాల్ అతి త్వరలో భారత జట్టు కోసం తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
Virat Kohli Advice Yash Dayal Against MS Dhoni: యశ్ దయాల్ అతి త్వరలో భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపిఎల్ 2023లో రింకూ సింగ్ 5 సిక్సర్లు కొట్టింది యష్ దయాల్ బౌలింగ్లోనే. ప్రస్తుతం ఈ యువ బౌలర్ తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అలాగే గతేడాది దయాల్ విసిరిన ఓ ఓవర్ మొదటి బంతికి సిక్స్ కొట్టిన తర్వాత ఎంఎస్ ధోనిని అవుట్ చేశాడు ఈ యంగ్ పేసర్.
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 18 మే 2024న కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి ఎంతో కీలకం. ఎందుకంటే విజయాన్ని నమోదు చేస్తే.. RCB ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో యష్ దయాల్ ఆ మ్యాచ్ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతని మొదటి బంతికి ఎంఎస్ ధోని 110 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి యష్ వద్దకు వచ్చి కీలక సలహా ఇచ్చాడు. దీంతో ఆ తర్వాతి బంతికే ధోని పెవిలియన్ చేరాడు.
విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్..
ఎంఎస్ ధోనిని ఔట్ చేసిన ఆ బంతికి విరాట్ కోహ్లీ ఏం సలహా ఇచ్చాడనేది అప్పుడు చర్చల్లో నిలిచింది. దీనిపై ప్రస్తుతం కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. యష్ దయాల్ తాజాగా ఇదే విషయంపై మాట్లాడుతూ, "ఎంఎస్ ధోనీకి ఫాస్ట్ బంతులు ఇష్టం. కాబట్టి, బాల్‌ని స్పీడ్‌గా సంధించకూడదు అని విరాట్ భాయ్ నాతో చెప్పాడు. మొదటి బంతికి సిక్స్ కొట్టిన తర్వాత, విరాట్ భాయ్ నన్ను శాంతింపజేశాడు. అతనితో మాట్లాడిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఈ క్రమంలోనే రెండో బంతికి నా వేగాన్ని తగ్గించాను, ధోని వికెట్‌ను పడగొట్టాను" అంటూ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024లో యశ్ దయాల్..
యశ్ దయాల్ మొత్తం సీజన్‌లో RCB తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందని అంతా భావిస్తున్నారు.