US Open 2020: యూఎస్ ఓపెన్ నుండి వైదొలిగిన జ‌కోవిచ్

US Open 2020: యూఎస్ ఓపెన్‌లో అత‌డు ఓ సంచలనం. వరుస విజయాలతో దూసుకెళ్తూ.. టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన ఆట‌గాడు.. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్. యూఎస్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా వైదొల‌గాల్సి వ‌చ్చింది

Update: 2020-09-07 13:14 GMT

Novak Djokovic out of US Open 2020

US Open 2020: యూఎస్ ఓపెన్‌లో  అతడో సంచలనం. వరుస విజయాలతో దూసుకెళ్తూ.. టెన్నిస్‌ ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలిచిన ఆట‌గాడు..అతడే సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్. త‌న ఆవేశంతో యూఎస్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా వైదొల‌గాల్సి వ‌చ్చింది. టోర్నీ నుండి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆవేశంతో బంతిని జ‌కోవిచ్ వెన‌క్కి విస‌ర‌గా ఆ బంతి నేరుగా అక్క‌డే ఉన్న లైన్ ఎంపైర్ గొంతుకు బ‌లంగా త‌గిలింది. దీంతో ఆమె అక్క‌డికక్క‌డే కుప్ప‌కూలిపోయారు. ఆట‌గాడు త‌న ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని దాటి ప్ర‌వ‌ర్తించ‌టంతో జ‌కోవిచ్ ను డిస్ క్వాలిఫై చేశారు.

స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో జకోవిచ్ తలపడ్డాడు. తొలి సెట్ మధ్యలో ఓ బంతిని అనవసర షాట్ కొట్టడంతో లైన్ జడ్జి గొంతుకు బంతి తాకింది. దీంతో డీఫాల్ట్ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా.. ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా బలంగా కొట్టడం, లేక కోర్టులో నిర్లక్ష్యంగా వ్యవహరించినా టోర్నీ నుంచి అనర్హుడు అవుతాడని యూఎస్ ఓపెన్ ప్రకటన విడుదల చేసింది

వెంటనే వెళ్లి.. ఎంపైర్ క్ష‌మాప‌ణ‌లు కోరాడు. త‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా కొట్ట‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా జ‌డ్జికి క్ష‌మాప‌ణ చెప్పాడు. ఇక త‌న ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల చింతిస్తున్నాన‌ని, యూఎస్ ఓపెన్ నిర్వాహ‌కులకు కూడా జ‌కోవిచ్ సారీ చెప్పాడు.

Tags:    

Similar News