India vs England: కలిసి రాని టాస్: మళ్లీ బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
India vs England: భారత్, ఇంగ్లాండ్ నాలుగో టీ20 మ్యాచ్ లోనూ టాస్ కలిసి రాలేదు. టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేయనుంది.
India vs England: భారత్, ఇంగ్లాండ్ నాలుగో టీ20 మ్యాచ్ లోనూ టాస్ కలిసి రాలేదు. టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లిష్ జట్టు సారథి మోర్గానే మళ్లీ టాస్ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ పోరు కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు. అప్పటితో పోలిస్తే పచ్చికను పూర్తిగా తొలగించారు. వికెట్ చాలా గట్టిగా ఉంది. ఆంగ్లేయులు మళ్లీ అదనపు పేస్, బౌన్స్‌తో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోరులో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్ చేజార్చుకుంటుంది. రాహుల్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
భారత్: 1 రోహిత్ శర్మ, 2 కెఎల్ రాహుల్, 3 విరాట్ కోహ్లీ (కెప్టెన్), 4 రిషబ్ పంత్ (కీపర్), 5 శ్రేయాస్ అయ్యర్, 6 సూర్యకుమార్ యాదవ్, 7 హార్దిక్ పాండ్యా, 8 వాషింగ్టన్ సుందర్, 9 శార్దుల్ ఠాకూర్, 10 భువనేశ్వర్ కుమార్, 11 ఆర్ చాహల్.
ఇంగ్లాండ్: 1 జాసన్ రాయ్, 2 జోస్ బట్లర్ (వికెట్ కీపర్), 3 డేవిడ్ మలన్, 4 జానీ బెయిర్‌స్టో, 5 ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), 6 బెన్ స్టోక్స్, 7 సామ్ కుర్రాన్, 8 క్రిస్ జోర్డాన్, 9 జోఫ్రా ఆర్చర్, 10 ఆదిల్ రషీద్, 11 మార్క్ వుడ్.