టీమిండియా ఓపెనర్ గా శుభ్‌మన్ గిల్?
ఇప్పటికే ఓపెనర్ గా రాహుల్ క్లిక్ అయినప్పటికీ అతనిని మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దింపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనితో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 27 నుంచి పోరు మొదలుకానుంది. నవంబర్ 27న ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరగనుంది. అయితే వన్డే, టీ20ల సిరీస్ లకు ఓపెనర్ రోహిత్ శర్మ దూరం కావడంతో శిఖర్ ధావన్ తో ఇన్నింగ్స్ ని ఎవరు స్టార్ట్ చేస్తారన్నది ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఓపెనర్ గా రాహుల్ క్లిక్ అయినప్పటికీ అతనిని మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దింపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనితో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండియన్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చూస్తుంటే శిఖర్ ధావన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2020లో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరు సత్తా చాటిన సంగతి తెలిసిందే. కోల్‌కతా తరఫున ఓపెనర్ గా శుభ్‌మన్ గిల్440 పరుగులు చేయగా, పంజాబ్‌కు కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ కూడా 418 పరుగులతో సత్తా చాటాడు. దీనితో శుభ్‌మన్ గిల్ కి ఓపెనర్ గా పంపే ఆలోచనలో ఉన్నారు సెలక్టర్లు.
ఇక అటు తొలివన్డేకు దాదాపుగా తుదిజట్టులో తొమ్మిది ఆటగాళ్ల స్థానాలు ఖరారైనట్లే.. ఇందులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా తుదిజట్టులో ఉంటారు. ఇక జట్టులో షమి, సైనీని తీసుకుంటే శార్దూల్ ఠాకూర్‌కు నిరాశ తప్పదనే చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా నవంబర్ 27న తొలి వన్డే, నవంబర్ 29న రెండో వన్డే, డిసెంబర్ 2న మూడే వన్డే జరగనుంది.