IND vs AUS: ఫైనల్ పోరుకు మొతేరా సిద్ధం.. టాస్‌దే 'కీ' రోల్.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
IND vs AUS: వరల్డ్ కప్ సమరం తుది అంకానికి చేరింది. 45 రోజుల ఈ క్రికెట్ పండుగకు రేపు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్‌తో తెరపడనుంది.
IND vs AUS: వరల్డ్ కప్ సమరం తుది అంకానికి చేరింది. 45 రోజుల ఈ క్రికెట్ పండుగకు రేపు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్‌తో తెరపడనుంది. ప్రపంచంలో అతి పెద్దదైన మొతేరా స్టేడియంలో రేపు బిగ్ ఫైట్ జరగనుంది. ఈ స్టేడియంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదయ్యాయి. 39 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 30 వన్డేలు జరిగాయి. ఇక్కడి పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 243. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్న తరుణంలో 243 రన్స్ తక్కువగానే కనిపిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15సార్లు గెలిస్తే.. చేజింగ్ చేసిన టీమ్ కూడా అన్నేసార్లు నెగ్గింది. ఇక ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ గెలిచే అవకాశం 56.67 శాతంగా ఉంది. అంటే టాస్ నెగ్గే జట్టుకే విజయావకాశాలు ఎక్కువ.
మొతేరా స్టేడియంలో అత్యధిక స్కోరు 365 రన్స్ ఫర్ 2 వికెట్స్. 2010లో భారత్‌పై సౌతాఫ్రికా నమోదు చేసింది స్కోర్ ఇది. కలిస్, డివిల్లీర్స్ సెంచరీలతో చెలరేగారు. అత్యల్ప స్కోరు 85 రన్స్. 2006లో వెస్టిండీస్ పై జింబాబ్వే అత్యల్ప స్టోర్ చేసింది. వ్యక్తిగత అత్యధిక స్కోరు 152 రన్స్ నాటౌట్. ఈ ప్రపంచ కప్ ప్రారంభ పోరులో ఇంగ్లండ్‌పై డెవాన్ కాన్వే సాధించిన స్కోర్ ఇది. ఈ స్టేడియంలో రికార్డ్ ఛేజింగ్ 325 రన్స్ ఫర్ 5 వికెట్స్. 2002లో ఈ లక్ష్యాన్ని 47.6 ఓవర్లలో భారత్ చేరింది. ఇక 1998లో భారత్‌పై 196 పరుగుల అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టు వెస్టిండీస్.