India vs England 3rd T20: గెలుపే లక్ష్యంగా బరిలోకి..కీలకం కానున్న టాస్

India vs England 3rd T20: ఐదు T20ల సిరీస్ లో చెరో విజయం సాధించాయి భారత్, ఇంగ్లాండ్ టీంలు.

Update: 2021-03-16 10:55 GMT

టీమిండియా ఆటగాళ్లు (ఫొటో బీసీసీఐ ట్విట్టర్)

India vs Engalnd 3rd T20: ఐదు T20ల సిరీస్ లో చెరో విజయం సాధించాయి భారత్, ఇంగ్లాండ్ టీంలు. ఇక నేడు (మంగళవారం) జరిగే మూడో వన్గేలో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా ఇరు టీంలు బరిలోకి దిగనున్నాయి.

రెండో వన్గేలో కీలకమైన ఇన్సింగ్ ఆడిన ఇషాన్ కిషన్ మరోమారు తన సత్తా చూపేందుకు సిధ్దం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి రావడం, బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆత్మవిశ్వాసంతో ఉంది టీమిండియా. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇది టీమిండియాకు మరింత బలం చేకూర్చనుంది.

ఇక రెండో వన్డేలో పరాజయంతో..మూడో వన్గేలో ఎలాగైన గెలిచి, సిరీస్ లో ముందుండాలని ఇంగ్లాండ్ ఆరాటపడుతోంది. టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడడం ఖాయంగా కనిపిస్తోంది.

రాహుల్ పై వేటు..?

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా 1, 0 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో ఈ మ్యాచ్‌ లో రాహుల్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోహిత్ శర్మ కచ్చితంగా మూడో టీ20లో ఆడడం ఖాయం. మరోవైపు తొలిమ్యాచ్ ఆడిన ఇషాన్‌ కిషన్‌..అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రోహిత్‌ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. పంత్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌తో బ్యాటింగ్‌ పటిష్ఠంగా ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాని సూర్యకుమార్‌కు ఈ మ్యాచ్‌లోనైనా ఛాన్స్‌ దొరకుతుందేమో చూడాలి.

ఒత్తిడిలో ఇంగ్లీష్ జట్టు

రెండో టీ20లో ఓటమితో ఒత్తిడిలో పడింది ఇంగ్లాండ్‌ టీమ్. ఈ మ్యాచ్‌లో విజయంతో తిరిగి విజయాల బాట పట్టాలనే కసితో కనిపిస్తోంది. కెప్టెన్‌ మోర్గాన్‌తో పాటు రాయ్‌, బట్లర్‌, మలన్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ లాంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది ఆ జట్టు. మరోవైపు బౌలింగ్‌ పరంగా చూస్తే పిచ్‌ స్పిన్‌కు ఎక్కువగా సహకరించే వీలుంది కాబట్టి పేసర్‌ టామ్‌ కరన్‌ స్థానంలో మొయిన్‌ అలీ జట్టులో చేరే అవకాశం ఉంది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన పేసర్‌ మార్క్‌వుడ్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. జోర్డాన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కష్టంగా మారింది.

నరేంద్ర మోడీ స్టేడియం

టాసే కీలకం కానుందా...

ఎర్రమట్టితో కనిపిస్తున్న పిచ్‌ స్పిన్‌కు సహకరించే వీలుందంటున్నారు. రెండు టీ20ల్లోనూ రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. ఎక్కువగా మంచు ప్రభావం లేనప్పటికీ టాస్‌ నెగ్గిన జట్టు మరోసారి బౌలింగ్‌కే మొగ్గు చూపే వీలుంది. ఈ నేపథ్యంలో టాస్‌ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు నుంచి జరిగే మిగతా మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహకులు తెలిపారు. రెండో టీ20 లో ప్రేక్షకులు సామాజిక దూరం పాటించడంలో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొ్నారు. 

భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్

Tags:    

Similar News