T20 Cricket Most Sixes: ధనాధన్ టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్లు, ఫోర్లతో బంతిని బౌండరీ దాటించాలని బ్యాట్స్ మెన్ లు, ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ని అవుట్ చేసి త్వరగా పెవిలియన్ పంపాలని చూసే బౌలర్ల మధ్య జరిగే మ్యాచ్ ని ఎంతో ఆసక్తిగా తిలకించే ప్రేక్షకులు... బంతి బంతికి ఉత్కంట రేపే ఈ టీ20 మ్యాచ్ లలో ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన మొదటి మూడు స్థానాల్లో వెస్టిండీస్ ఆటగాళ్ళు ఉండటం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ కి చెందిన ఆటగాళ్ళు నిలిచారు. తమ భీకరమైన బ్యాటింగ్ తో వెస్టిండీస్ ఆటగాళ్ళు ఎవరికీ అంతనంత దూరంలో క్రిస్ గేల్, కిరాన్ పోలార్డ్ లు మొదటి రెండు స్థానాల్లో నిలవగా టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ 400 క్లబ్ లో చేరి ఎనిమిదవ స్థానంలో నిలిచాడు.
క్రిస్ గేల్ 1043 (వెస్టిండీస్)
పోలార్డ్ 759 (వెస్టిండీస్)
రస్సెల్ 510 (వెస్టిండీస్)
మెక్ కల్లమ్ 485 (న్యూజిలాండ్)
షేన్ వాట్సన్ 467 (ఆస్ట్రేలియా)
ఏబి డివిలియర్స్ 436 (దక్షిణాఫ్రికా)
ఆరోన్ ఫించ్ 401 (ఆస్ట్రేలియా)
రోహిత్ శర్మ 400 (భారత్)