Tokyo Olympics: మహిళల హాకీ సెమీ ఫైనల్లో పోరాడి ఓడిన భారత్
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో ఛాంపియన్ ఆస్ట్రేలియాపై గెలుపుతో బంగారు పతకంపై ఆశలు రేపిన మహిళల జట్టు సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో పోరాడి ఓడింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే గోల్ చేసిన గుర్జీత్‌కౌర్ గెలుపుపై ఆశలు రేపింది. అయితే, ఆ తర్వాత పుంజుకున్న అర్జెంటీనా టీమ్ 18వ నిమిషంలో గోల్‌తో బోణీ చేసింది. అనంతరం టీమిండియాపై ఒత్తిడి తెస్తూ 36వ నిమిషంలో మరో గోల్ చేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఈ నెల 6న బ్రాంజ్ మెడల్ కోసం భారత మహిళల జట్టు బ్రిటన్‌తో పోరాడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కాంస్య పతకం దక్కనుంది.
మరోవైపు భారత మహిళల పోరాటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా టీమిండియా సెమీస్‌కు చేరుకోవడం పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ నెల 6న బ్రిటన్‌తో జరగనున్న కాంస్య పోరులో గెలిచి పతకం సాధించాలని క్రీడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.