Tokyo Olympics: సెమీస్‌లో సింధు ఓట‌మి.. బ్రాంజ్‌ కోసం మ‌రో మ్యాచ్‌

Tokyo Olympics: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది.

Update: 2021-07-31 11:22 GMT

Tokyo Olympics: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. చైనీస్‌ తైపీకి చెందిన తైజుయింగ్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో 18-21, రెండో గేమ్‌లో 12-21 తేడాతో తైజు చేతిలో ఓడిపోయింది. మ్యాచ్‌ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకంజలో పడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకూ గట్టి పోటీ ఇచ్చింది.

చివరికి తొలి గేమ్‌ను 21-18తో కైవసం చేసుకుంది. అపై మరింత పట్టుదలగా ఆడిన ఆమె రెండో గేమ్‌లోనూ ఏ అవకాశం ఇవ్వలేదు. చివరికి సింధు ఓటమిపాలవ్వక తప్పలేదు. దీంతో సింధు గోల్డ్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. అయితే బ్రాంజ్ మెడ‌ల్ కోసం ఆమె రేపు మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ సాధించిన సింధు టోక్యోలో మాత్రం కాంస్య ప‌త‌కం కోసం పోటీప‌డ‌నున్న‌ది.

Tags:    

Similar News