MS Dhoni : ధోని అరుదైన రికార్డు : మూడేళ్ళ క్రితం ఇదే రోజున..
MS Dhoni : టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు సృష్టించి నేటికి మూడేళ్ళు అవుతుంది. సరిగ్గా మూడేళ్ళ
MS Dhoni : టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు సృష్టించి నేటికి మూడేళ్ళు అవుతుంది. సరిగ్గా మూడేళ్ళ క్రితం అంటే 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాడు ధనుంజయ్ ని స్టంప్ అవుట్ చేసి వన్డేల్లో వంద స్టంప్ ఔట్లు చేసిన తోలి వికెట్ కీపర్ గా నిలిచాడు ధోని.. వన్డేల్లో ధోని మొత్తం 123 స్టంప్ ఔట్లు చేశాడు. ధోని తర్వాత శ్రీలంకకి చెందిన సంగక్కర (99), రొమేష్ కలువితర్నా (75), పాక్ కి చెందిన మొయిన్ ఖాన్ (73), ఆస్ట్రేలియాకి చెందిన ఆడమ్ గిలిక్రిస్ట్ (55) స్టంప్ ఔట్లు చేశారు.
ఇక ధోని విషయానికి వచ్చేసరికి గత నెల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.. బంగ్లాదేశ్‌తో 2004 సంవత్సరంలో జజరిగిన మ్యాచ్ తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోని.. 2007 లో టీ 20 ప్రపంచకప్ తో కెప్టెన్ గా మారాడు.. ఆ తరవాత కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్నో విజయాలను జట్టుకు అందించాడు ధోని.. అతని సారధ్యంలో టీంఇండియా జట్టు 2007 టీ 20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్, 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. ప్రస్తుతం ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.