Thomas And Uber Cup: థామస్, ఉబెర్ టోర్నీ వాయిదా!
Thomas And Uber Cup: ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ జరిగేది అనుమానంగా మారింది. కరోనా వైరస్ భయంతో పలు దేశాలు వైదొలగడం,
Thomas And Uber Cup: ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ జరిగేది అనుమానంగా మారింది. కరోనా వైరస్ భయంతో పలు దేశాలు వైదొలగడం, మేటి షట్లర్లు టోర్నీ బరిలోకి దిగేందుకు వెనుకాముందు ఆడుతుండడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా జరగాల్సిన ఈ టోర్నీని ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈ టీమ్ చాంపియన్‌షిప్ వచ్చే నెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని ఆర్హస్‌లో జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, తైవాన్ ఇంతకుముందే టోర్నమెంట్ నుంచి వైదొలగగా..13 సార్లు చాంపియన్ ఇండోనేసియా, దక్షిణ కొరియా కూడా గతవారం తప్పుకొన్నాయి.
అలాగే .. చైనా, జపాన్ జట్లు తమ ఎంట్రీలను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఆ రెండు దేశాలు కూడా వైదొలగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ టోర్నీలో ఆడాల్సిన భారత షట్లర్ సైనా నెహ్వాల్ కూడా చాంపియన్‌షిప్‌ను కొనసాగించడాన్ని ప్రశ్నించింది. ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది.