కోహ్లి అప్పటివరకు రిటైర్ అవ్వడు : హర్భజన్

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ పైన ఓటమి పాలు కాగా, ఇక గతేడాది ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలు కావడం, దీంతో రెండు సార్లు టీమ్‌ఇండియా జట్టు ఐసీసీ ట్రోఫీలను చేయిజార్చుకుంది.

Update: 2020-11-23 10:03 GMT

జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ గా పేరు సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లి. ఆ తర్వాత కెప్టెన్ గా కూడా సత్తా చాటాడు కోహ్లి. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కోహ్లి కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్ని విజయాలను అందుకున్నప్పటికి అతడిలో ఓ లోటు మాత్రం ఉంది. అదే ఇప్పటివరకు అతని కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం. ఆ అవకాశం కోహ్లికి రెండుసార్లు వచ్చినట్టే వచ్చి మిస్ అయింది.

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ పైన ఓటమి పాలు కాగా, ఇక గతేడాది ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలు కావడం, దీంతో రెండు సార్లు టీమ్‌ఇండియా జట్టు ఐసీసీ ట్రోఫీలను చేయిజార్చుకుంది.. దీంతో ఎలాగైనా ఐసీసీ కప్పు సాధించాలనే కోరిక కోహ్లిలో బలంగా అలాగే ఉండిపోయింది. అయితే త్వరలోనే కోహ్లి ఆ ఫీట్ ని అందుకుంటాడని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

ప్రతి ఒక్క కెప్టెన్ కి ప్రపంచకప్‌ సాధించాలనే కోరిక ఉంటుంది. కోహ్లి చాలా గొప్ప ఆటగాడు. అతను ఎంత గొప్ప ఆటగాడు అనేది ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు. ఇక ప్రపంచకప్ ను సాధించి తన కలను పరిపూర్ణం చేసుకుంటాడు. బహుశా వచ్చే ఏడాది కోహ్లి ఆ ఘనతను అందుకుంటాడని భావిస్తున్నాను.. ప్రస్తుతం ఉన్న జట్టును చూస్తుంటే కోహ్లి ఆ ఘనతను అందుకోవడం పెద్ద విషయమేమీ కాదని అనిపిస్తుంది. అయితే కోహ్లి ఏదో ఒక టైటిల్‌ సాధించకుండా మాత్రం రిటైర్‌ కాబోడని హర్భజన్ వ్యాఖ్యానించాడు.

Tags:    

Similar News