IPL 2020: ఏ టీమ్‌కు ఎంత మంది అభిమానులున్నారో తెలుసా...
IPL 2020: ఐపీఎల్ ఓ క్రికెట్ సంగ్రామం. క్రికెట్ అభిమానులకు సరికొత్త పండుగ . అనుక్షణం ఉత్కంఠ.. అంతులేని ఉత్సహాం.. ఈ సమరం మొదలు కావడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. బీసీసీఐ కూడా తర్వలోనే షెడ్యూల్ ప్రకటించనున్నది.
IPL 2020: ఐపీఎల్ ఓ క్రికెట్ సంగ్రామం. క్రికెట్ అభిమానులకు సరికొత్త పండుగ . అనుక్షణం ఉత్కంఠ.. అంతులేని ఉత్సహాం.. ఈ సమరం మొదలు కావడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. బీసీసీఐ కూడా తర్వలోనే షెడ్యూల్ ప్రకటించనున్నది. ప్రతి ఏడాది ఈ సమరం ప్రారంభానికి ముందు ఐపీఎల్ అభిమానుల మధ్య మొదలయ్యే గొడవ ఒకటే. ఏ టీంకు ఎక్కువ మంది అభిమానులున్నారు. ఏ టీంకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఐపీఎల్ టీంకి సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసుకుందాం..
రాజస్థాన్ రాయల్స్ ఫేస్‌బుక్‌లో 4.1 మిలియన్ లైక్ ఉన్నాయి. ట్విట్టర్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్, అలాగే యూట్యూబ్ విషయానికి వస్తే.. 179 కే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
కింగ్ ఎలెవన్ పంజాబ్ ఫేస్‌బుక్‌లో 8.4 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 2మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ ఫాలోవర్స్, అలాగే యూట్యూబ్ విషయానికి వస్తే.. 153 కే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫేస్‌బుక్‌లో 5.4 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 1.4 మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ విషయానికి వస్తే.. 144కే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
అలాగే కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఫేస్‌బుక్‌లో 16 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 4 మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ విషయానికి వస్తే.. 384 కే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేస్‌బుక్‌లో 5.9 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 2.9 మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ విషయానికి వస్తే.. 260 కే సబ్‌స్క్రైబర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ ఫేస్‌బుక్‌లో 9.2 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 3.6 మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 4 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ విషయానికి వస్తే.. 896 కే సబ్‌స్క్రైబర్స్
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫేస్‌బుక్‌లో 12 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 5.7 మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ విషయానికి వస్తే.. 734 కే సబ్‌స్క్రైబర్స్
ముంబాయి ఇండియన్స్ కు ఫేస్‌బుక్‌లో 13 మిలియన్ లైక్, ట్విట్టర్‌లో 5.6 మిలియన్ ఫాలోవర్స్ , ఇస్టాగ్రామ్‌లో 4.9 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ విషయానికి వస్తే.. 639 కే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఐపీఎల్ 2020 సమరంలో ఏ జట్టు ట్రోపీని కైవసం చేస్తుందో చూడాలి.