BCCI: తెలుగు అమ్మాయిలకు బీసీసీఐ బంపర్ ఆఫర్.. మేఘన అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!

BCCI: భారత మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది.

Update: 2023-04-28 08:30 GMT

BCCI: తెలుగు అమ్మాయిలకు బీసీసీఐ బంపర్ ఆఫర్.. మేఘన అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!

BCCI: భారత మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. మూడు గ్రేడ్లలో కలిపి మొత్తం 17మందితో వార్షిక కాంట్రాక్ట్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. తాజాగా వెలువడిన ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు దక్కడం విశేషం. లెఫ్ ఆర్మ్ మీడియం పేసర్ అంజలి, స్పెషలిస్ట్ బ్యాటర్ సబ్బినేని మేఘన ఇరువురూ గ్రేడ్ సి కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. అంజలి గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ తో ఆరంగేట్రం చేసింది. ఇప్పటివరకు 6 టీ20ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. ఇక, స్పెషలిస్ట్ బ్యాటర్ గా టీమిండియాలో అడుగుపెట్టిన మేఘన ఇప్పటివరకు 3 వన్డేలు, 17 టీ20లు ఆడింది.

గ్రేడ్ సీ కాంట్రాక్ట్ లిస్ట్ లో మేఘనా, అంజలితో పాటు ఏడుగురు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మేఘనా సింగ్, దేవిక వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహరాణా, రాధాయాదవ్, హర్లీన్ డియోల్, యాస్తికాభాటియా ఉన్నారు.

గ్రేడ్ బి విషయానికొస్తే రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీవర్మ, జేమియా రోడ్రిగ్స్, రేణుకా ఠాకూర్, రిచా ఘోష్ ఉన్నారు.

ఇక గ్రేడ్ ఏ జాబితాలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు.

మొత్తంగా 17మందితో బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా ఇది ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అమలులో ఉంటుంది. ఇక ఏ కేటగిరి క్రీడాకారిణులకు రూ.50 లక్షలు, బి కేటగిరి వారికి రూ.30 లక్షలు, సీ కేటగిరీ ప్లేయర్లు రూ.10లక్షలు వేతనం అందుకుంటారు.

Tags:    

Similar News