Pink Ball Test: పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం
Pink Ball Test: బౌలర్ల దెబ్బకు రెండు రోజుల్లోనే ఫలితం. రెండు రోజుల్లో 30 వికెట్లు నేలకూలాయి
Pink Ball Test: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన డై/నైట్ క్రికెట్ టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోహ్లీసేన. రెండో ఇన్సింగ్స్ లో 49 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఈజీగా విజయం సాధించింది. రోహిత్ శర్మ 25 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 14 రన్స్ చేశాడు. తన స్పిన్ మాయా జాలంతో అద్భుతం చేసిన అక్షర పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విక్టరీతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అడుగుపెట్టేందుకు టీమిండియా దగ్గరైంది. మరోవైపు ఈ ఓటమి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి ఇంగ్లాండ్ నాకౌటైంది. ఇక నాలుగో టెస్ట్ వచ్చే నెల 4 నుంచి ఇదే వేదికగా జరగనుంది.
అంతకుముందు, టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడిపోయారు. 33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 49 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత బౌలింగ్‌లో అక్షర్ పటేల్(5/32) ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ (4/48) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. కేవలం 46 పరుగుల మాత్రమే జోడించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐదు వికెట్లు తీసి కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
ఈ టెస్టులో మొత్తంగా బౌలర్లదే పై చేయిగా ఉంది. మొత్తం రెండు రోజుల్లోనే 30 వికెట్లు నేలకూలాయంటే బౌలర్లు ఎలా చెలరేగారో తెలుసుకోవచ్చు. మొతెరా పిచ్ అనుకున్నట్లుగా స్పిన్ కు అనుకూలంగా మరడంతో..కేవలం రెండు రోజుల్లోనే ఫలితం తేలిపోయింది. ఇంగ్లాండ్ టీమ్ రెండు ఇన్సింగ్సుల్లో ఆలౌట్ అవ్వగా..టీం ఇండియా తొలి ఇన్సింగ్స్ లో పది వికెట్లు చేజార్చుకుంది.
సొంత గ్రౌండ్ లో ఆడుతున్న టీం ఇండియా బౌలర్ అక్షర పటేల్ మూడో టెస్టులో ఆకాశమే హద్దులా చెలరేగాడు. రెండు ఇన్సింగ్స్ ల్లో కలిపి 11 వికెట్లు తీసి ఇంగ్లీష్ టీం ను కోలుకోకుండా చేసి భారీ దెబ్బ కొట్టాడు. అలాగే అశ్విన్ కూడా 7 వికెట్లతో తన సత్తా చాటాడు. ఇక ఇంగ్లాండ్ టీం బౌలర్లు కూడా తమ సత్తా చాటారు. రూట్(5), లీచ్(4) లు భారత్ తొలి ఇన్సింగ్స్ లో 9 వికెట్లు తీసి ఇండియాను కూడా తక్కువ పరుగులకే ఆలౌట్ చేశారు.
ఇక, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన 4 ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా ఇంతకముందు టెస్టుల్లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే ఉన్నారు. దీంతో పాటు అశ్విన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.