Rahul Dravid: టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్..! టీ 20 తర్వాత బాధ్యతలు
Rahul Dravid: T20 ప్రపంచ కప్ 2021 తర్వాత భారత జట్టుకి కొత్త కోచ్ రాబోతున్నారు
Rahul Dravid: T20 ప్రపంచ కప్ 2021 తర్వాత భారత జట్టుకి కొత్త కోచ్ రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. మంగళవారం ఆయన కోచ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. T20 ప్రపంచ కప్ 2021 తర్వాత ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. రాహుల్ ద్రవిడ్ అతని స్థానంలో నియమిస్తారని అందరూ అంటున్నారు. ఇంతకుముందు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా చేయడానికి ససేమిరా అన్నారు. అయితే సుదీర్ఘ సంభాషణ తర్వాత BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనిని ఒప్పించారు. ఇటీవల రాహుల్ ద్రవిడ్ టీమిండియాతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అప్పుడు అతను ప్రధాన కోచ్ బాధ్యతను పోషించారు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ సారథ్యంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించింది.
T20 ప్రపంచ కప్ తర్వాత టీమ్ ఇండియా న్యూజిలాండ్ నుంచి స్వదేశీ సిరీస్ ఆడవలసి ఉంది. మళ్లీ అక్కడి నుంచి రాహుల్ ద్రవిడ్ జట్టు కమాండ్‌ని తీసుకోవచ్చని తెలుస్తోంది. నిజానికి రాహుల్ ద్రవిడ్ చాలా ఏళ్లుగా భారత జూనియర్ ఆటగాళ్ల కోసం పనిచేశాడు. అండర్-19 జట్టుకు ప్రపంచకప్ సాధించిపెట్టిన అతడు భారత్ ఎ లో ఆటగాళ్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియాకు ప్రధాన కోచ్‌గా ఉన్నప్పటికీ భారత్-ఎ, అండర్-19 జట్లపై కన్నేసి ఉంచుతాడని అందరు భావిస్తున్నారు.
ద్రవిడ్ జీతం ఎంత?
ప్రధాన కోచ్ పాత్ర కంటే ద్రవిడ్ పాత్ర పెద్దది అయితే అతని జీతం కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి బీసీసీఐ రూ.8న్నర కోట్లు ఇస్తుండగా, ద్రావిడ్‌కి మాత్రం అతని కంటే ఎక్కువ వేతనం ఆఫర్ చేసింది. ద్రవిడ్‌కు బీసీసీఐ రూ.10 కోట్ల వరకు ఇవ్వొచ్చని అంచనా.
ఫీల్డింగ్ కోచ్‌గా అజయ్ రాత్రా?
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ పోస్టుకి భారత మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా దరఖాస్తు చేసుకున్నారు. రాత్రా 6 టెస్టులు, 12 వన్డేలు కాకుండా 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో హర్యానాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ మాజీ ఆటగాడికి మంచి కోచింగ్ అనుభవం ఉంది. ప్రస్తుతం అసోం ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నారు. ఐపీఎల్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేశారు. గతంలో భారత మహిళల జట్టుకి కూడా పని చేశారు.