రోహిత్ సక్సెస్ క్రెడిట్ ధోనిదే : గంభీర్
రోహిత్ శర్మ.. ఇండియన్ టీంలో మోస్ట్ హిట్టర్ బ్యాట్స్ మెన్ గా పేరు సంపాదించుకున్నాడు..
రోహిత్ శర్మ.. ఇండియన్ టీంలో మోస్ట్ హిట్టర్ బ్యాట్స్ మెన్ గా పేరు సంపాదించుకున్నాడు.. అయితే రోహిత్ సక్సెస్ కి అసలు కారణం ధోనినే అని వ్యాఖ్యానించాడు ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఏ కెప్టెన్ కూడా ఒక ఆటగాడికి అంతగా మద్దతు ఇవ్వలేదని కానీ ధోని రోహిత్ కి చాలా సార్లు మద్దతుగా నిలిచాడని గంభీర్ పేర్కొన్నాడు. జట్టులో రోహిత్ స్థానం ఎప్పుడు కూడా ప్రశ్నార్ధకం గానే ఉండేదని కానీ కెప్టెన్ అయిన ధోని అతనికి మద్దతు ఇస్తూనే వచ్చాడని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఇవ్వాళ రోహిత్ ఈ స్థాయిలో ఉండటానికి మీరు సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్ మెంట్ గురించి మాట్లాడొచ్చు.. కానీ కెప్టెన్ మద్దతు లేకపోతే ఇవన్నీ యూజ్ లెస్. ప్రతిదీ కెప్టెన్ చేతిలోనే ఉంటుంది అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఒక ప్లేయర్ ని ప్రోత్సహించడం వల్ల ఓ అద్భుతమైన ఆటగాడు బయటకు వస్తాడని, అందుకు చక్కటి ఉదాహరణ రోహిత్ శర్మనే ని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇక సీనియర్లు అయిన రోహిత్, కోహ్లీలు యంగ్ స్టర్స్ ని ప్రోత్సహిస్తారని భావిస్తున్నట్టుగా గంభీర్ అన్నాడు.