భారత జట్టులో అత్యంత అంకితభావం ఉన్న వ్యక్తి అతనొక్కడే : వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా క్రికెట్‌ను మలుపుతిప్పిన కోల్‌కతా టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ద్వయం చూపిన తెగువ ఈడెన్ గార్డెన్స్ లో ఆసీస్ జట్టుపై చరిత్రాత్మక విజయం అందించింది. రెండో ఇన్నింగ్స్ లో వీరిద్దరూ కలిసి 376 పరుగులు భారీ భాగస్వామ్యం అందించారు. వీరిద్దరి ఓపికకు ఎన్ని ప్రశంసలు లభించాయో తేలియంది కాదు.
ఆ మ్యాచ్‌లో ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ను లక్ష్మణ్ (452 బంతుల్లో 281, 44 ఫోర్లు), ద్రవిడ్ (353 బంతుల్లో 180, 20 ఫోర్లు) రన్స్ చేశారు. దీంతో 657/7 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు ముందు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. వీరిద్దరి జోడీ ఆసీస్ వరస 16 టెస్టుల విజయాలకు బ్రేక్ వేశారు.
భారత జట్టులో ఆడిన ప్లేయర్లలో అత్యంత అంకితభావం ఉన్న విద్యార్థి రాహుల్ ద్రవిడ్ అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. కీపింగ్ బాధ్యతల నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ జట్టు కోసం వికెట్‌కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడని ప్రశంసించాడు. తన కెరీర్‌లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సహచరులతో.. కలిసి ఆడానని లక్ష్మణ్ పేర్కొన్నాడు. వారిలో నచ్చిన అంశాలు, నేర్చుకున్న పాఠాలను వివరిస్తానని మే30న వీవీఎస్ ట్వీట్ చేశాడు. బుధవారం ద్రవిడ్ గురించి మాట్లాడాడు.
'క్రికెట్‌లో అత్యంత అంకితభావం ఉన్న విద్యార్థి రాహులే అని అన్నాడు. ఎదురైన ప్రతి సవాల్‌ను పూర్తి బాధ్యతతో ఎదుర్కొన్నాడు. నిరాకరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ టెస్టు క్రికెట్లో వికెట్ కీపింగ్ చేశాడు. టెస్టుల్లో ఓపెనింగ్‌కు దిగాడు. అదీ అత్యంత జాగ్రత్త, చురుగ్గా' అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు.