India Vs England Test: 78 పరుగులకే కోహ్లి సేన ఆలౌట్.. ఇంగ్లాండ్ 120/0

* నిరుత్సాహపర్చిన ఇండియన్‌ బ్యాట్స్‌మెన్స్ * 42 పరుగుల స్వల్ప అధిక్యంలో ఇంగ్లండ్‌

Update: 2021-08-26 06:45 GMT

విరాట్ కోహ్లీ (ట్విట్టర్ ఫోటో)

India Vs England Test: మొదటి రెండు టెస్ట్‌ల్లో మెరిసిన భారత్‌.. మూడో టెస్ట్‌లో ముచ్చెమటలు కారుస్తోంది. టాస్‌ గెలిచి బ్యాట్‌ పట్టిన కోహ్లీసేన 78 పరుగులకే ఆలౌటైంది. ఇక రంగంలోకి దిగిన ఇంగ్లండ్‌ భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేలా విరుచుకపడింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల స్వల్ప అధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ 52 రన్స్, హసీబ్‌ హమీద్ 60 రన్స్‌తో అదరగొట్టారు.

ఇండియన్ టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. రోహిత్ శర్మ 19 రన్స్ చేశాడు. 19 రన్స్‌ చేసిన రోహిత్‌ శర్మనే టాప్‌ స్కోరర్‌గా నిలవాల్సి వచ్చింది. ఇతని తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ అంతా అలా వచ్చి ఫేస్‌ చూపించి వెళ్లారంతే.. మొదటి రోజు కీపర్‌ జోస్ బట్లర్‌ ఏకంగా 5 క్యాచులు అందుకొని ఇండియన్‌ టీంను పెవిలియన్‌కు పంపించాడు. 

Tags:    

Similar News