Team India: జట్టులోకి సూర్య కుమార్..!! వైస్ కెప్టెన్ పై వేటు తప్పదా..!?

* ఓవల్ లో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం జట్టులో భారీ మార్పులు చేయనున్న భారత్

Update: 2021-08-31 06:52 GMT
అజింక్య రహానే (ట్విట్టర్ ఫోటో)

Team India Playing XI : టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో తమ ప్రదర్శనతో ఫర్వాలేదనిపించి రెండవ టెస్ట్ లో ఘన విజయాన్ని పొందిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో పేలవమైన బ్యాటింగ్ తో మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌట్ అయి భారత క్రీడాభిమానులను నిరాశపరిచింది. అదే పిచ్ పై ప్రత్యర్ధి జట్టు నాలుగు వందలకు పైగా పరుగులను సాధించి టీమిండియా జట్టుకు భారీ పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచడం ఆ పరుగులని సాధించలేక కనీస ఆధిక్యం కూడా ఇంగ్లాండ్ జట్టుకు ఇవ్వలేక ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమి చవి చూడటంతో ఇప్పుడు అందరి దృష్టి భారత బ్యాట్స్ మెన్ లపై పడింది.

ప్రస్తుత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్య రహనే ఈ సిరీస్ లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోవడంతో సెప్టెంబర్ 2న జరగబోయే నాలుగో టెస్ట్ మ్యాచ్ కి అజింక్య రహనే పక్కనపెట్టి అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ లేదా సూర్య కుమార్ యాదవ్ లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తుంది. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన కాసేపటికే మోకాలి గాయంతో ఆసుపత్రి పాలయిన రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి దాదాపుగా ఖాయమని సమాచారం.

ఇషాంత్ శర్మ స్థానంలో శార్దుల్ టాగూర్ లేదా హనుమ విహారికి అవకాశం దక్కనుంది. అటు బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ కూడా చేయగలిగే విహారికి మ్యాచ్ సమయానికి జట్టు యాజమాన్యం బ్యాటింగ్ పై దృష్టి పెడితే హనుమ విహారిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జట్టు సభ్యుల మార్పుతోనైన ఆటలో మార్పు తో అభిమానులను ఘోర పరాజయం నుండి మరిపించి అద్భుత విజయంతో మురిపిస్తారో లేదో చూడాల్సిందే.

భారత జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, పుజారా, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ / సూర్య కుమార్ యాదవ్, హనుమ విహారి/ శార్దుల్ టాగూర్, అశ్విన్, సిరాజ్, బుమ్రా, షమీ

Tags:    

Similar News