Rohit Sharma: ఆసియా కప్ గెలిచిన తర్వాత అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. అదేంటంటే?

Ind Vs SL: గ్రేట్ ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో శ్రీలంకను ఓడించి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ ఇలాంటి బ్యాడ్ న్యూస్ చెప్పడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చినట్లైంది.

Update: 2023-09-18 06:30 GMT

Rohit Sharma: ఆసియా కప్ గెలిచిన తర్వాత అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. అదేంటంటే?

Rohit Sharma Statement, IND vs SL: వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్-2023 ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ భారత అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు.

10 వికెట్ల తేడాతో గెలిచి, 8వ ఆసియా కప్ ట్రోఫీని గెలిచిన భారత్..

8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంక జట్టు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. దీంతో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా అద్భుత ప్రదర్శనతో భారత జట్టు శ్రీలంకను కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనంతరం లక్ష్యాన్ని 37 బంతుల్లోనే ఛేదించింది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, హార్దిక్ 3 వికెట్లు తీశాడు.

కీలక అప్‌డేట్ ఇచ్చిన కెప్టెన్..

విజయం తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందించాడు. వచ్చే వారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి 2 వన్డేలకు ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ దూరం కావచ్చని ప్రకటించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. ఈ కారణంగా, అతను ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఫైనల్‌లో భాగం కాలేకపోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఆస్ట్రేలియాతో 2 వన్డేలకు దూరం..

రోహిత్ మాట్లాడుతూ, 'అక్షర్‌కు చిన్న గాయం ఉంది. అతను వారం లేదా 10 రోజుల్లో కోలుకుంటాడని తెలుస్తోంది. దీని గురించి నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను. మరి ఎలాంటి పురోగతి ఉంటుందో చూడాలి. కొంతమంది త్వరగా కోలుకుంటారు. అక్షర్ విషయంలో కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఆస్ట్రేలియాతో తొలి రెండు మ్యాచ్‌లు ఆడతాడో లేదో తెలియదు' అంటూ షాకింగ్ న్యూస్ అందించాడు.

శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్..

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గురించి కూడా రోహిత్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయాస్ 99 శాతం ఫిట్ గా ఉన్నాడని రోహిత్ తెలిపాడు. పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో అయ్యర్ వెన్ను గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత అతను ఆసియా కప్ ఆడలేకపోయాడు. గత కొన్ని రోజులుగా నెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోహిత్‌ మాట్లాడుతూ, 'శ్రేయస్‌కు కొన్ని ప్రమాణాలు సెట్ చేయబడినందున అతను మ్యాచ్ ఆడలేకపోయాడు. అతను 99 శాతం ఫిట్‌గా ఉన్నాడు. ఆయన గురించి చింత లేదంటూ' గుడ్‌న్యూస్ ప్రకటించాడు.

Tags:    

Similar News