Kuldeep Yadav: బాలీవుడ్ నటితో కుల్దీప్ వివాహం.. పుకార్లపై కారిటీ ఇచ్చిన చైనామన్ బౌలర్..!

Kuldeep Yadav: టీ20 ప్రపంచ కప్‌ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు.

Update: 2024-07-08 09:30 GMT

Kuldeep Yadav: బాలీవుడ్ నటితో కుల్దీప్ వివాహం.. పుకార్లపై కారిటీ ఇచ్చిన చైనామన్ బౌలర్..!

Kuldeep Yadav: టీ20 ప్రపంచ కప్‌ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు. అయితే, విజేత జట్టులోని ఆటగాళ్లకు వారి వారి సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. ఇటు సిరాజ్ నుంచి అటు శివం దూబే వరకు ఇలా ప్రతీ ఒక్కరికి అద్భుతమైన స్వాగతం లభించింది. ఇక చైనామన్ బౌలర్ కుల్దీప్‌ యాదవ్‌కు (Kuldeep Yadav) కూడా కాన్పూర్‌లో ఘనమైన ఆహ్వానం దక్కింది. ఈ క్రమంలో కుల్దీప్ తన పర్సనల్ విషయాల గురించి కీలక విషయాలు వెల్లడించాడు.

ఈ క్రమంలో కుల్దీప్ తన ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ తెలిపాడు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఆటగాడి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో కుల్దీప్ ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలపై కుల్దీప్ స్పందించాడు. ఏ హీరోయిన్‌తోనూ తాను ప్రేమలో లేనంటూ తేల్చి చెప్పేశాడు. అలాగే, తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదంటూ క్లారిటీ ఇచ్చేశాడు. నాతోపాటు నా కుటుంబాన్ని సక్రమంగా చూసుకునే అమ్మాయి కావాలంటూ తేల్చి చెప్పాడు. తన పెళ్లిపై త్వరలోనే అందరికీ స్వయంగా చెబుతానంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక ప్రపంచ కప్‌ గెలవడంపై కుల్దీప్ తన ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాంటి అద్భుతమైన సమయం కోసం ఎంతో కాలంగా వేచి చూసినట్లు ప్రకటించాడు. అలాగే, పీఎం నరేంద్ర మోడీని కలవడం నాలో ఎనలేని ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో 10 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. భారత విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

Tags:    

Similar News