T20 World Cup 2021: ఓడిన జట్టు ఇంటికే..!! నేడు భారత్ - కివీస్ మధ్య కీలక మ్యాచ్

* దుబాయ్ స్టేడియంలో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య హోరాహోరి మ్యాచ్

Update: 2021-10-31 10:14 GMT

భారత్ vs న్యూజిలాండ్‌ 

T20 World Cup 2021 - India Vs New Zealand: భారత్ - న్యూజిలాండ్‌ మధ్య అక్టోబర్ 31 ఆదివారం రోజున జరగనున్న టీ20 మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ ఆశలను సజీవం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో ఉన్న లోపాలను సరిదిద్దుకునే అవకాశం లభించింది.

దుబాయ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మంచు పభావం ఎక్కువగా ఉండటం వలన టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బౌలింగ్ ని ఎంచుకునే అవకాశాలున్నాయి. దీంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో టాస్ కీలకంగా మారనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ బౌలర్ బౌల్ట్ టీమిండియా జట్టు బ్యాట్స్ మెన్ ని తన బౌలింగ్ అటాక్ తో కట్టడి చేస్తానంటూ చేసిన కామెంట్స్ కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తాము న్యూజిలాండ్‌ బౌలర్స్ ని ఎదుర్కోడానికి, వారి బౌలింగ్ పై ఎదురుదాడి చేయడానికి సిద్దంగా ఉన్నామని కౌంటర్ ఇచ్చాడు.

ఈరోజు జరగనున్న మ్యాచ్ లో భారత జట్టు ఓటమికి ఏమాత్రం అవకాశం లేదు. ఓడితే అద్భుతాల కోసం ఎదురుచూడాల్సిందే. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందంజ వేయనుండగా ఇప్పటికే భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ మీద గెలిచిన పాకిస్థాన్‌ జట్టు గ్రూప్ 2 టేబుల్ లో అగ్రస్థానంతో దాదాపుగా సెమీస్‌ చేరినట్లే.

మ్యాచ్ వివరాలు:

భారత్ vs న్యూజిలాండ్‌

అక్టోబర్ 31(ఆదివారం)2021

సాయంత్రం 7.30 నిమిషాలు

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

హెడ్ టూ హెడ్:

భారత్, న్యూజిలాండ్‌ ఇరు జట్లు ఇప్పటివరకు 16 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో తలపడగా భారత్ 8, న్యూజిలాండ్‌ 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఇక ఇరు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆదివారం అక్టోబర్ 31న మరోసారి తలపడనున్నాయి.

భారత్ జట్టు:

రోహిత్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ (c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్‌ జట్టు:

మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (c), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్ (WK), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

Tags:    

Similar News