HCA అధ్యక్ష పదవిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

HCA: టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2021-10-21 12:43 GMT

HCA అధ్యక్ష పదవిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

HCA: టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం అజార్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అజారుద్దీన్. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ పిటిషన్‌పై గురువారం నాడు కోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ తరఫు న్యాయవాదుల వాదనలను విని అజారుద్దీన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అపెక్స్ కౌన్సిల్ కు భారీ ఊరట లభించింది.

Tags:    

Similar News