IND vs NZ: వాంఖడే పిచ్ మార్పుపై ఐసీసీ సీరియస్.. భారత క్రికెట్‌పై విమర్శలకు గవాస్కర్ రివర్స్ కౌంటర్..!
IND vs NZ: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముంబై వాంఖడే పిచ్‌ను మార్చడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పందించింది.
IND vs NZ: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముంబై వాంఖడే పిచ్‌ను మార్చడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పందించింది. స్వతంత్ర సలహాదారు ఆండీ అంట్కిన్సన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే పిచ్ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సుదీర్ఘంగా సాగే మెగా టోర్నీలో పిచ్ మార్పు సర్వసాధారణమని పేర్కొంది. పిచ్ బాగా లేదనడానికి ఎలాంటి కారణం లేదని తెలిపింది. పిచ్ ఎంపిక, తయారీ బాధ్యత ఆతిథ్య సంఘానిదేనని పేర్కొంది. భారత్, న్యూజిలాండ్ సెమీ పైనల్ కోసం వాంఖడే స్టేడియంలో కొత్త పిచ్‌ను రూపొందించారు.
అయితే భారత స్పిన్నర్లకు అనుకూలించేలా మ్యాచ్‌ను పాత పిచ్ మీదకు మార్చినట్లు వార్తలు వచ్చాయి. పిచ్ మార్చారంటూ వచ్చిన వ్యాఖ్యలపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పిచ్ మార్చారంటూ వాగిన మూర్ఖులు నోళ్లు ముయ్యాలంటూ మండిపడ్డారు. భారత్ క్రికెట్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పిచ్ మార్చినప్పటికి టాస్‌కు ముందే రెండు జట్లకు అందుబాటులో ఉందని అన్నారు.