World Cup Final 2011: ఫిక్సంగ్ ఆరోపణలపై విచారణ నిలిపేసిన శ్రీలంక పోలీసులు... కారణం అదే

World Cup Final 2011: వన్డే ప్రపంచ కప్ 2011 భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక క్రీడాశాఖ మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Update: 2020-07-04 03:00 GMT
Mahela Jayawardene (File Photo)

World Cup Final 2011: వన్డే ప్రపంచ కప్ 2011 భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక క్రీడాశాఖ మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అలుత్గామాగే చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఆ దేశంలో పెను దుమారం రేపాయి. అలుత్గామాగే వ్యాఖ్య‌ల‌పై మినల్ ఇన్విస్టిగేషన్ మొదలైందని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. దాంతో శ్రీలంక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై స‌మ‌గ్ర‌ విచారణను ఆదేశించింది. ఇప్పటికే మహిదానందను దర్యాప్తు బృందం విచారించింది. ఫిక్స్ అరోప‌ణ‌ల‌పై క్రిమినల్ ఇన్విస్టిగేషన్‌ను కూడా ప్రారంచిందని.. ఈ మేర‌కు లంక క్రీడా శాఖ సెక్రటరీ కెడిఎస్ రువాన్‌చంద్ర పేర్కొన్నారు.

ఒక రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలనలను ప్రామాణికంగా తీసుకొని మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై విచారణ పేరుతో తమ దిగ్గజ క్రీడాకారులను అవమానిస్తున్నారంటూ... దేశంలో తీవ్ర విమర్శలు రావడంతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, ఇకపై ఎలాంటి విచారణ ఉండబోదని శ్రీలంక పోలీసులు స్పష్టం చేశారు.

శ్రీలంక మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేల విచారించారు. ఇక ఎలాంటి సందేహాలు అవసరం వారు వెల్లడించారు. అప్పటి క్రీడా మంత్రి మహిదానంద అలుత్‌గమగే చేసిన 14 ఆరోపణల్లో ఒక్కదానికీ కనీస ఆధారం లేదు. మున్ముందు ఆటగాళ్లను ప్రశ్నించాల్సిన అవసరమూ రాదనీ పోలీసులు స్పష్టం చేశారు. ' మా అంతర్గత చర్చల తర్వాత విచారణను ముగించాలని నిర్ణయించుకున్నాం. మా నివేదికను కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శికి పంపిస్తాం' అని దర్యాప్తు అధికారి జగత్‌ ఫొన్సెకా తేల్చి చెప్పారు'. ఫైనల్‌ జరిగిన 9ఏళ్ల తర్వాత ఇలా వ్యవహరించడంపై తొలి రోజునుంచే పలువురు క్రికెట్‌ అభిమానులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శించారు.

మరోవైపు వన్డే వరల్డ్‌ కప్‌ 2011 ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కూడా పేర్కొంది. ఇటీవల మ్యాచ్‌ గురించి వచ్చిన ఆరోపణలపై దృష్టి పెట్టాం. కొత్తగా విచారణ జరిపేందుకు కావాల్సిన అంశాలు కూడా ఏమీ లేవనీ అని ఐసీసీ ఏసీయూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ పేర్కొన్నారు.


Tags:    

Similar News