మెరిసిన ధావన్.. ఢిల్లీ జట్టు భారీ స్కోర్!
ఐపీఎల్ 13 వ సీజన్ లో ఫైనల్ బెర్త్ కోసం పోటిపడుతున్న హైదరాబాదు, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోరులో ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది.. నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది
ఐపీఎల్ 13 వ సీజన్ లో ఫైనల్ బెర్త్ కోసం పోటిపడుతున్న హైదరాబాదు, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోరులో ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది.. నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా ఢిల్లీ జట్టుకి ఓపెనర్లు స్టాయినిస్, శిఖర్ ధావన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.. ఇద్దరు వరుస బౌండరీలతో విరుచుకపడ్డారు.. వీరిద్దరిని విడదీయడానికి హైదరాబాదు బౌలర్లు ఎనమిదో ఓవర్లు వేయాల్సి వచ్చింది.. అయితే ఎనమిదో ఓవర్లో రషీద్ వేసిన రెండో బంతికి స్టాయినిస్ (38) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీనితో 86 పరుగుల వద్ద ఢిల్లీ జట్టు మొదటి వికెట్ ని కోల్పోయింది..
ఆ తరవాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసి ధావన్ జట్టు స్కోర్ ను ముందుండి నడిపించాడు..ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేశాడు ధావన్.. ఈ నేపధ్యంలో శ్రేయస్ అయ్యర్ (21) ఔట్ అయ్యాడు.. ఇక ఆ తరవాత వచ్చిన హెట్‌మైయర్, ధావన్ ఇద్దరు కలిసి హైదరాబాదు బౌలర్ల పైన విరుచుకపడ్డారు.. 19 ఓవర్లకు వచ్చేసరికి కేవలం రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులను చేసింది ఢిల్లీ జట్టు.. ఇక 19 వ ఓవర్ లో సందీప్ శర్మ వేసిన మూడో బంతికి ధావన్ (78) ఎల్బీగా ఔట్ అయ్యాడు.. దీనితో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు 189 పరుగులు చేసింది.. అటు చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఢిల్లీ అయిదు మ్యాచ్ లు ఓడిపోగా, వార్నర్ సేన ఆడిన ఆఖరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిడం విశేషం..