RCB vs SRH: సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్
RCB vs SRH: చితగగ్గొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్
RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్.సీ.బీ ఆఖరి వరకు పోరాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్ 67, మార్ క్రమ్ 35 పరుగులు, సమద్ 37 పరుగులు చేశాడు.
ఆర్.సీ.బీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్భుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 పోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. కెప్టెన్ డుప్లేసిస్ 62 , విరాట్ కోహ్లి 42 పరుగులతో మెరిపించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేస్తూ తనకు తిరుగు లేదని మరోసారి చాటి చెప్పింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ మెరిసిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ముందడుగు వేసింది.